మళ్లీ పెరిగిన బంగారం ధరలు

3 May, 2021 16:16 IST|Sakshi

న్యూఢిల్లీ: బంగారం ధరలు నేడు (మే 3 సోమవారం) మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.47,000లకు చేరువలో ఉంది. కొద్దీ రోజులు నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మరలా నేడు ఒక్కసారిగా పెరిగాయి. భవిష్యత్ లో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.46, 743 నుంచి రూ.46960కు పెరిగింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,817 నుంచి రూ.43,015కు పెరిగింది.

ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.43,800 నుంచి రూ.44,000కు చేరుకుంది. నిన్నటి నుంచి ధర రూ.200 పెరిగింది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.47,780 నుంచి రూ.48,000కు పెరిగింది . అంటే ఒక్కరోజులో రూ.220 రూపాయలు పెరిగింది అన్నమాట. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధర పెరిగితే వెండి ధరలు తగ్గాయి. నేడు కేజీ వెండి ధర రూ.68,350 నుంచి రూ.68,297కు తగ్గింది. 

చదవండి: 

వాహనదారులకు అదిరిపోయే శుభవార్త!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు