భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే?

19 Apr, 2021 18:27 IST|Sakshi

బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఏప్రిల్ 1 నుంచి రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా కేసులు భారీగా పెరగడమే అని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది కూడా కరోనా సమయంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈసారి కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నేడు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.46,917 నుంచి రూ.47,555కు పెరిగింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,976 నుంచి 43,560కు పెరిగింది. అంటే ఒక్క రోజులో సుమారు రూ.600 పెరిగింది.   

ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.44,160 నుంచి రూ.44,250కు చేరుకుంది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.48,170 నుంచి రూ.48,270కు పెరిగింది ఉంది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.68,286 నుంచి రూ.68,482కు పెరిగింది. అయితే బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయానికి ఏ రేట్లు ఉన్నాయో తెలుసుకొని కొనుగోలు చేస్తే మంచిదని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: 

లాక్‌డౌన్ పై నిర్మలా సీతారామన్ మరోసారి క్లారిటీ


>
మరిన్ని వార్తలు