Gold Price: భారీగా పెరిగిన బంగారం ధర

18 May, 2021 19:48 IST|Sakshi

న్యూఢిల్లీ: కొద్దీ రోజుల పాటు తగ్గిన బంగారం ధర మళ్లీ రెండు రోజుల నుంచి పెరుగుతూ వస్తుంది. బంగారం ధర విషయంలో నిపుణులు కూడా ఎప్పుడు పెరగుతుందో, తగ్గుతుందో అంచనా వేయలేకపోతున్నారు. దేశరాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10గ్రాములు బంగారం ధర నేడు రూ.300 పెరగడంతో రూ.48,480కు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ ఏర్పడటంతోనే ధర పెరిగినట్లు బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. ఇక వెండి ధర అయితే భారీగా పెరిగింది. నేడు రూ.1433 పెరగడంతో కిలో రూ.73,168 చేరింది.

ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగి రూ.45,450 వద్ద నిలిచింది. అలాగే, పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల 10 గ్రాములు ప్యూర్ గోల్డ్ ధర మాత్రం రూ.330  పెరిగి రూ.49,590కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,869 డాలర్లు కాగా, వెండి ఔన్సు 28.48డాలర్లుగా నమోదైంది.

చదవండి:

ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం?

మరిన్ని వార్తలు