Gold Price: ఫెస్టివల్ ఎఫెక్ట్.. బంగారం మరింత ప్రియం

25 Oct, 2021 14:54 IST|Sakshi

భారతదేశంలో బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో కొనుగోలుదారులు ఆసక్తి కనబరచడంతో పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా పుత్తడి ధరలు రెండు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ప్రపంచ మార్కెట్లలో బంగారం రేట్లు నేడు $1,800 స్థాయికి చేరుకున్నాయి. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇండియన్ బులియన్ & గోల్డ్ జ్యువెలరీ ప్రకారం 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర సుమారు రూ.400 పెరిగి రూ.48,048కు చేరుకుంది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల పసిడి ధర రూ.43,639 నుంచి రూ.44,012కు పెరిగింది. 

ఇక హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో రూ.100 పెరిగిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,760కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరగడంతో రూ.46,760కి చేరింది. ఇక వెండి ధర కూడా బంగారంతో పాటు పెరిగింది. నేడు రూ. 900 పెరిగి రూ. 65,777 చేరుకుంది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి.(చదవండి: డ్యాన్స్‌తో అదరగొట్టిన సీఈవో)

మరిన్ని వార్తలు