ఇక సామాన్యులు బంగారం కొనడం కష్టమేనా..!

9 Mar, 2022 17:31 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులను కొనసాగిస్తుండటంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీల నుంచి బంగారంలోకి వేగంగా మళ్లిస్తున్నారు. దీంతో యల్లో మెటల్‌ అంతర్జాతీయ మార్కెట్, అందుకు అనుగుణంగా దేశీయ మార్కెట్‌లో దూసుకెళ్తుంది. దీంతో సామాన్యుడు బంగారం కొనాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే సామాన్యులు బంగారం కొనడం ఇక కష్టతరం కూడా కానుంది. బంగారం ధరల పెరుగుదల ఎప్పుడు ఉండదు అని, కొద్ది రోజుల తర్వాత అంతే స్థాయిలో తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.

భారత్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర 1.37 శాతం పెరిగి రూ. 54,965 వద్ద, వెండి కిలోగ్రాముకు 2.21 శాతం పెరిగి రూ.72,960 వద్ద ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్‌ గోల్డ్‌ 999) బంగారం ధర సుమారు రూ.700కి పైగా పెరిగి రూ.54,283కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.48,924 నుంచి రూ.49,723కు చేరుకుంది.ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.49,400 నుంచి రూ.49,800కి పెరిగింది. ఇక బిస్కెట్‌ గోల్డ్‌ బంగారం ధర రూ.440 పెరిగి రూ.54,330కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.1,500కి పెరిగి రూ.71,878కి చేరుకుంది.

(చదవండి: కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకి బంపర్ ఆఫర్..!)

మరిన్ని వార్తలు