రెండో రోజు పెరిగిన బంగారం ధరలు

29 Jul, 2021 17:53 IST|Sakshi

దేశంలో బంగారం ధరల్లో స్థిరత్వం ఏ మాత్రం కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా రెండో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో ఆ ప్రభావం మనదేశ బంగరం ధరల మీద పడింది. ఎంసిఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.186 పెరిగి 10 గ్రాముల ధర రూ.47,763 వద్ద ఉంది. స్పాట్ మార్కెట్లో అత్యధిక స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.47,761కు లభిస్తుండగా, వెండి ధర కిలోకు రూ.66,386గా ఉందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపింది. 

హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. స్వచ్చమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹48,880 నుంచి ₹48,990 పెరిగింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹100 పెరిగి ₹44,900గా ఉంది. నేడు విజయవాడ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. ‎డెల్టా కరోనావైరస్ వేరియంట్ తో అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ప్రమాదం లేదని జెరోమ్ పావెల్ చెప్పడం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన ప్రకటన తర్వాత ‎‎బంగారం ధరలు ‎‎పెరిగాయి. స్పాట్ బంగారం ధర 0.1% పెరిగి ఔన్స్ కు 1,801.10 డాలర్ల వద్ద ఉంది.

>
మరిన్ని వార్తలు