కస్టమర్లకు షాకిస్తున్న బంగారం, వెండి: ఆరు నెలల్లో తొలిసారి! 

5 Dec, 2022 16:17 IST|Sakshi

సాక్షి,ముంబై: బంగారం, వెండి ధరలు భారీ షాకిచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పుత్తడి ధరలు దూసు కెడుతున్నాయి.  ఇటీవల  కాస్త స్తబ్దుగా ఉన్న పసిడి ధర భారీగా పెరిగింది. అటు వెండి ధర గణనీయంగా పుంజుకుంది.  తాజాగా గ్రాము బంగారం రూ.54 వేల మార్క్‌ను దాటేసింది. దీంతో త్వరలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకునే సూచనలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.  మరో విలువైన మెటల్‌  వెండి  కూడా ఇదే బాటలో ఉంది.  వెయ్యిరూపాయలకు పైగా జంప్‌ చేసింది.  

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ధర 350 రూపాయలకు పైగా పెరిగింది.  ఎంసీఎక్స్‌ ఫిబ్రవరి కాంట్రాక్ట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.362 లేదా 0.67 శాతం పెరిగి రూ. 54212కి చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో కిలో వెండి ధర రూ.850-900 పెరిగింది. ఫిబ్రవరి డెలివరీ వెండి ధర ప్రస్తుతం రూ.851 లేదా 1.28 శాతం పెరిగి కిలో రూ.67300కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక డిమాండ్ పెరగడం ఈ గణనీయమైన పెరుగుదలకు కారణమని మార్కెట్‌  వర్గాలు తెలిపాయి. గత ఆరు నెలల్లో   ఎంసీఎక్స్‌ బంగారం ధర రూ.54,000కి చేరడం ఇదే తొలిసారి. (StockMarketUpdate: కోలుకున్న మార్కెట్లు, కుప్పకూలిన రూపాయి)


దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.227 పెరిగి రూ.54,386కి చేరుకుంది. వెండి కూడా కిలోకు రూ.1,166 పెరిగి రూ.67,270కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్‌లో సానుకూల సంకేతాల మధ్య డిసెంబర్ 5 సోమవారం ముంబై స్పాట్ మార్కెట్‌లోరం 999 స్వచ్ఛత బంగారం ప్రారంభ ధర 10 గ్రాములకు రూ.53,972గా ఉంది, శుక్రవారం ముగింపు ధర రూ.53,656 నుంచి రూ.316 పెరిగింది. అలాగే 999 స్వచ్ఛత వెండి కిలో రూ. 65,891గా ఉంది. ( స్కీంలో నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే.. కోటి రూపాయలు)

ప్రపంచ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం  ఔన్సుకు 11.15 డాలర్లు లేదా 0.62 శాతం పెరిగి 1,820.75 డాలర్ల వద్ద, వెండి ఔన్స్‌కు 0.245 డాలర్లు  లేదా 1.01 శాతం బలంతో   23.485 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో ట్రెండ్‌ బుల్లిష్‌గా ఉందని బులియన్‌ వర్తకులు చెబుతున్నారు. డాలర్ బలహీనత కారణంగా, చమురు ధరల సెగ కారణంగా  బంగారం ధరలు పెరిగాయని  ఎనలిస్టుల అంచనా.  (అందాల ఐశ్వర్యమా, కింగ్‌ లాంటి కుర్రాడా? ఎవరు కావాలి?)

మరిన్ని వార్తలు