సామాన్యులకు దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..!

26 Jan, 2022 17:43 IST|Sakshi

ఈ ఏడాది మొదట్లో కొద్దిగా తగ్గినట్లు కనిపించిన బంగారం ధరలు ఇప్పుడు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ దేశాల్లో భౌగోళిక ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడం, క్రూడ్‌ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరడం, కరోనా కొత్త వేరియంట్ విజృంభణ వంటి కారణాల చేత బంగారం ధరలు పరుగుపెడుతున్నాయి. దీంతో, సామాన్యుడు బంగారం బంగారం కొనలంటేనే ఒంట్లో దడ పుడుతుంది. అహ్మదాబాద్ మార్కెట్లో మంగళవారం 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.50,500కు, వెండి ధరలు కిలోకు రూ.64,500కు చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరల్లో ఊర్థ్వముఖ ధోరణి కన్పిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

"రాబోయే రోజుల్లో బంగారం & వెండి ధరలు పెరుగుతాయని మేము ఆశిస్తున్నాము" అని అహ్మదాబాద్ బిలియన్ వ్యాపారి హేమంత్ చోక్సీ చెప్పారు. "రష్యాతో పెరుగుతున్న ఘర్షణ మధ్య ఉక్రెయిన్'కు అమెరికా సైనిక సహాయం అందించడంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.55,000 చేరుకొనున్నట్లు భావిస్తున్నారు. "వెండి ధర కూడా పెరిగి కిలోకు రూ.65,000-రూ.70,000 పరిధిలో స్థిరపడుతో౦దని" భావిస్తున్నారు. 

స్థానిక మార్కెట్లలో బంగారం డిమాండ్ సాపేక్షంగా ఉన్నప్పటికీ, పరిశ్రమలు & బులియన్ పెట్టుబడిదారుల నుంచి వెండికి డిమాండ్ బాగా పెరిగింది. "మార్కెట్లో ప్రతిరోజూ ఎగుమతిదారులు కనీసం 2 టన్నుల వెండిని కొనుగోలు చేస్తున్నారు. దీనిలో ఎక్కువ భాగం పారిశ్రామిక ఉపయోగం కోసం" అని చోక్సీ తెలిపారు. కొత్త కోవిడ్ వేవ్ వల్ల అనేక వివాహాలు వాయిదా పడడంతో గత మూడు వారాలుగా బంగారం డిమాండ్ కొద్దిగా తగ్గింది. కానీ, పెట్టుబదుదారులు ఇప్పుడు ఇటువైపు మల్లడంతో బంగారనికి డిమాండ్ ఏర్పడినట్లు విశ్లేషకులు తెలుపుతున్నారు. నేడు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరిగి రూ.50,100కు చేరుకోగా; 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.45,900కు చేరుకుంది.

(చదవండి: ప్రపంచ వ్యాప్తంగా విండోస్‌ 11 యూజర్లు ఎంతో తెలుసా ?)

మరిన్ని వార్తలు