భారీగా పడిపోయిన బంగారం ధరలు

7 Feb, 2021 15:55 IST|Sakshi

బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. మొన్నటిదాకా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు.. ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూసే వారికి ఇది తీపికబురు. గతంలో రూ.56వేల గరిష్ట స్థాయికి చేరుకున్న 10 గ్రాముల పసిడి ధర.. ప్రస్తుతం రూ.48వేలకు పడిపోయింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48వేలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44వేలుగా ఉంది.

కేవలం గత వారం రోజుల్లోనే తులం బంగారం ధర రూ.1,570 క్షిణించడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1,570 క్షిణించడంతో రేటు రూ.48,060కు దిగొచ్చింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,440 పడిపోయి ధర రూ.44,050కు తగ్గింది. దీంతో మొన్నటిదాకా కొనుగోలు దారులు లేక వెలవెలబోయిన జ్యువెలరీ షాపులు ఇప్పుడు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా దిగివచ్చాయి. కేజీ వెండి ధర రూ.73,400 రూపాయలకు తగ్గింది. గ్లోబల్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు బలహీన పడటంతో భారతదేశంలో కూడా ధరలు తగ్గాయి. (చదవండి: మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్)

మరిన్ని వార్తలు