రికార్డు హైనుంచి రూ.7 వేలు పడిన పసిడి ధర

12 Jan, 2021 13:19 IST|Sakshi

మంగళవారం స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు 

సాక్షి, ముంబై:  ప్రపంచ సంకేతాల మధ్య బంగారం ధరలు ఈ రోజు కూడా దిగి వచ్చాయి. 2021 ఆరంభంనుంచి  ఓలటైల్‌గా ఉన్న పుత్తడి ధరలు రికార్డు  స్థాయిల దిగువకు చేరుతున్నాయి.  గడిచిన మూడు రోజుల్లో (నిన్నపెరిగాయి) రెండు సెషన్లలో నష్టపోతూ ఆల్‌ టైం గరిష్టం నుంచి  దాదాపు 7వేల రూపాయల మేర  పడిపోయింది.

బంగారం ధరలు నేడు (మంగళవారం, జనవరి 12) స్వల్పంగా క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 49,328  రూపాయల వద్ద ఉంది. వెండి అదే దారిలో ఉంది. కిలోకు 175 రూపాయల మేర క్షీణించింది. ఫిబ్రవరి బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాములకి 0.03% తగ్గి డాలర్లకు చేరుకోగా, వెండి ఫ్యూచర్స్ 0.22% క్షీణించి కిలోకు, 65,414 కు చేరుకుంది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.333.00 (0.68శాతం ) పెరిగి రూ.49,300.00 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.328.00 (0.67శాతం) పెరిగి రూ.49,340 వద్ద క్లోజ్ అయింది. శుక్రవారం  పసిడి ధర భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే.

అయితే అంతర్జాతీయంగా బంగారం ధర 0.7శాతం పెరిగింది.  స్పాట్ బంగారం ఔన్స్‌కు 0.2శాతం పెరిగి 1,847 డాలర్ల వద్ద ఉండగా, వెండి 0.8శాతం పెరిగి 25.11 డాలర్లకు చేరుకుంది. హైదరాబాద్‌ లో  సుమారు 440 రూపాయలు క్షీణించిన 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 45,900, 24 క్యారెట్ల ధర 50070 వద్ద ఉంది. వెండి ధర కిలోకి 69,600 పలుకుతోంది.

మూడేళ్ల కనిష్టం నుండి యుఎస్ డాలర్‌ పుంజుకోవడంతో పాటు, అమెరికా 10 సంవత్సరాల యుఎస్ బాండ్‌ ఈల్డ్స్‌ ఎగిసాయి. ఈ నెల చివర్లో అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ ఉద్దీపన ప్యాకేజీని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. దీనికి తోడు తక్కువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో రాజకీయవాతావరణం, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ల లాభాలు, పలుదేశాల్లో కరోనా టీకాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వైరస్‌ నియంత్రణలోకి వస్తుందని భావిస్తున్నారు.ఇది బంగారం ధరలను ప్రభావితం చేస్తుందనీ, బలహీనమైన డాలర్ కారణంగా బంగారానికి కనిష్ట స్థాయిల్లో మద్దతు లభిస్తుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. కాగా భారీ డిమాండ్ నేపథ్యంలో 2020 ఏడాదిలోపసిడి ధరలు 25 శాతం పెరిగాయి. ఆగస్టులో 10 గ్రాముల ధర రూ. 56,200 వద్ద రికార్డు స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు