హాట్‌మెటల్‌ ఒడిదుడుకులు

1 Oct, 2020 19:13 IST|Sakshi

ముంబై : బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగుతున్నాయి. గడిచిన సెషన్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు గురువారం భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ యల్లోమెటల్‌ స్వల్పంగా పెరిగింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 46 రూపాయలు పెరిగి 50,450 రూపాయలు పలకగా, కిలో వెండి 272 రూపాయలు భారమై 60,190 రూపాయలకు ఎగబాకింది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్స్‌కు 1895 డాలర్లకు చేరాయి. అమెరికాలో మరో ఉద్దీపన ప్యాకేజ్‌పై అస్పష్టతతో పాటు డాలర్‌ ఒడిదుడుకులతో సాగడంతో బంగారం కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ (కమోడిటీస్‌) తపన్‌ పటేల్‌ పేర్కొన్నారు. చదవండి : పసిడి పరుగుకు బ్రేక్‌

మరిన్ని వార్తలు