బంగారం కొనుగోలుదారులకు పండుగ షాక్!

14 Oct, 2021 19:08 IST|Sakshi

దసరా, దీపావళి పండుగ సందర్భంగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు చేదువార్త. ఈ పండుగ సమయంలో ప్రజలు భారీగా బంగారం కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా పసిడి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్చమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.47,307 నుంచి రూ.47,959కు పెరిగింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర సుమారు రూ.600కి పైగా పెరిగి రూ.43,930 చేరుకుంది. కేవలం వారం రోజుల్లోనే వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది.

ఇక హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో రూ.600 పెరిగిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,760కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరగడంతో రూ.44,700కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి ధర రూ.900కి పైగా పెరిగి రూ.62,693కు చేరింది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి.(చదవండి: 6జీ ఇంటర్నెట్ స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు