రూ 70,000కు చేరువైన వెండి

15 Sep, 2020 18:20 IST|Sakshi

ఫెడ్‌ భేటీపై ఇన్వెస్టర్ల చూపు

ముంబై : బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరగడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ విధాన భేటీ నేపథ్యంలో పసిడి ధరలు కొండెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ గోల్డ్‌ ధరలు భారమయ్యాయి. ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం 471 రూపాయలు భారమై 52,158 రూపాయలకు చేరింది. చదవండి : డాలర్‌ డీలాతో భారమైన బంగారం

ఇక కిలో వెండి 855 రూపాయలు ఎగబాకి 69,820 రూపాయలకు చేరింది. డాలర్‌ బలహీనపడటంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఎగిశాయి. ఇన్వెస్టర్లు గోల్డ్‌లో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో స్పాట్‌గోల్డ్‌ ఔన్స్‌ 1962.78 డాలర్లకు పెరిగింది. ఇక బుధవారం ముగిసే అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ తీసుకునే నిర్ణయాలపై బంగారం ధరల తదుపరి దిశ ఆధారపడి ఉంటుందని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు