రూ . 52,059 పలికిన పసిడి

16 Sep, 2020 18:56 IST|Sakshi

రూ . 70,000కు చేరువైన వెండి

ముంబై : ఒడిదుడుకులతో సాగుతున్న బంగారం ధరలు బుధవారం భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఫ్లాట్‌గా ముగిసినా దేశీ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్‌ కేసులు ప్రబలడం, ఆర్థిక వ్యవస్థలు ఇప్పట్లో కోలుకోలేవనే అంచనాలతో మదుపుదారులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపారు.

ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి 290 రూపాయలు పెరిగి 52,059 రూపాయలకు ఎగబాకింది. ఇక కిలో వెండి 61 రూపాయలు భారతమై 69,028 రూపాయలకు పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అమెరికన్‌ ఫెడ్‌ నిర్ణయంపై ఇన్వెస్టర్లు వేచిచూస్తుండటంతో బంగారం కొనుగోళ్లపై వేచిచూసే ధోరణి వెల్లడవుతోంది. వడ్డీరేట్లపై ఫెడరల్‌ రిజర్వ్‌ ఎలాంటి చర్యలు చేపడుతుందనేది బంగారం ధరల తదుపరి దిశను నిర్ణయిస్తుందని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : బంగారం : రూ. 50 వేల దిగువకు వస్తేనే!

మరిన్ని వార్తలు