కొండెక్కుతున్న బంగారం ధర!

22 Apr, 2021 18:59 IST|Sakshi

అస‌లే క‌రోనా మహమ్మరీ కాలం.. అటుపై వ‌చ్చే నెల‌లో పెండ్లిండ్ల సీజ‌న్‌. వివాహాల వేళ మ‌గువ‌లు బంగారు ఆభ‌ర‌ణాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే, ఇలాంటి పరిస్థితులలో బంగారం కొనుగోలుచేయాలనే వారికి ఇది ఒక ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. తాజాగా క‌రోనా మహ‌మ్మారి ప్ర‌భావంతో బంగారం ధర ప్రియం అవుతున్న‌ది. గ‌తేడాది మాదిరిగానే క‌రోనా కేసులు పెరుగుతున్నా కొద్దీ బంగారం, వెండి ధ‌ర‌లు జెట్ స్పీడ్‌లో పెరుగుతున్నాయి. 

నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.47,174 నుంచి రూ.47,864కు పెరిగింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ43,211 నుంచి రూ.43,843కు చేరుకుంది. అంటే ఒక్క రోజులో సుమారు రూ.350 తగ్గింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర నేడు రూ.44,850 నుంచి రూ.45,100కు చేరుకుంది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 10 గ్రాములు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.48,930 నుంచి రూ.49,200కు పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.68,608 నుంచి రూ.69,966కు పెరిగింది.

చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి!

>
మరిన్ని వార్తలు