దిగివచ్చిన బంగారం ధరలు

13 Oct, 2020 12:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలు మంగళవారం దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 237 రూపాయలు పతనమై 50,870 రూపాయలకు దిగిరాగా వెండి కిలోకు 525 రూపాయలు పతనమై 62,573 రూపాయలు పలికింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్స్‌కు 1919 డాలర్లకు పడిపోయాయి.

బంగారం ధరలు మరింత పతనమయ్యే దశలో కరోనా వైరస్‌ కేసులు ప్రబలడం, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ పరీక్షలు నిలిచిపోవడంతో గోల్డ్‌ ధరలు కొంతమేర పుంజుకున్నాయి. ఇక అంతర్జాతీయ అనిశ్చితి పరిస్ధితులు, ఉద్దీపన ప్యాకేజ్‌లపై అస్పష్టతతో బంగారం ధరలు మరికొంత కాలం ఒడిదుడుకులతో సాగుతాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : బంగారం మళ్లీ భారం!

మరిన్ని వార్తలు