రూ . 50,000 దిగువకు రానుందా!

7 Oct, 2020 17:49 IST|Sakshi

తగ్గుముఖం

ముంబై : కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్‌పై చర్చలను అమెరికా అర్థంతరంగా ముగించడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పతనమయ్యాయి. గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు దిగివచ్చాయి. ఎంసీఎక్స్‌లో బుధవారం పదిగ్రాముల బంగారం 465 రూపాయలు తగ్గి 50,061 రూపాయలకు దిగివచ్చింది. కిలో వెండి 748 రూపాయలు తగ్గి 60,000 దిగువకు 59,823 రూపాయలకు పడిపోయింది.

ఇక ఉద్దీపన ప్యాకేజ్‌పై స్పష్టత కొరవడటం, డాలర్‌ బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌ ధర 1,877 డాలర్లకు పడిపోయింది. బంగారంలో పెట్టుబడులపై ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంభించవచ్చని, దీంతో మరికొన్ని రోజులు పసిడి ధరలు ఒడిదుడుకులకు లోనవుతాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : గుడ్‌న్యూస్‌ : భారీగా తగ్గిన బంగారం

మరిన్ని వార్తలు