మళ్లీ పెరిగిన పసిడి ధరలు

14 Oct, 2020 12:22 IST|Sakshi

ఉద్దీపన ప్యాకేజ్‌పై ఆశలు ఆవిరి : గోల్డ్‌కు పెరిగిన డిమాండ్‌

ముంబై : క్రమంగా దిగివస్తున్న బంగారం ధరలు బుధవారం మళ్లీ భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. అమెరికాలో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్‌పై ఆశలు ఆవిరవడంతో గోల్డ్‌కు డిమాండ్‌ ఊపందుకుంది. ఇక ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 110 రూపాయలు పెరిగి 50,355 రూపాయలు పలకగా, వెండి కిలో 273 రూపాయలు భారమై 60,815 రూపాయలు పలికింది. చదవండి : మూడోరోజూ భగ్గుమన్న బంగారం

మరోవైపు అమెరికాలో కరోనా వైరస్‌ ఉద్దీపన ప్యాకేజ్‌కు అమెరికన్‌ సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ మోకాలడ్డారు. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోవడంతో ప్రభుత్వం ప్రతిపాదించిన 1.8 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజ్‌ ఎంతమాత్రం సరిపోదని పెలోసి తిరస్కరించారు. మరో ఉద్దీపన ప్యాకేజ్‌పై ఆశలు సన్నగిల్లడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడికి ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్‌ పెరిగింది.

మరిన్ని వార్తలు