బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు!

27 Jan, 2022 12:48 IST|Sakshi

గత కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. ఉక్రెయిన్‌ - రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో 1850 డాలర్లకు చేరిన ఔన్స్ బంగారం ధర 1 శాతానికి పైగా తగ్గి 1815 డాలర్లకు దిగి వచ్చింది. అమెరికాలో వడ్డీరేట్ల పెంచుతున్నందున డాలర్‌ బలోపేతం కావడం ఇందుకు కారణం. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో ఆ ప్రభావం మన దేశం మీద కూడా పడింది. న్యూఢిల్లీలో 10 గ్రాముల మేలిమి(999 స్వచ్చత) బంగారం ధర రూ.380కి పైగా తగ్గి రూ.48,502 వద్ద నిలిచింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.44,428గా ఉంది. 

మన హైదరాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. పెట్టుబడి కోసం కొనుగోలు చేసే 999 స్వచ్చత గల బంగారం ధర రూ.50,100 నుంచి రూ.49,640కి తగ్గింది. అంటే, ఒక్కరోజులో రూ.460కి పైగా తగ్గింది అన్నమాట. ఇక 916 స్వచ్చత గల పసిడి ధర రూ.400 తగ్గి రూ.45,500కి చేరుకుంది. బంగారంతో వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఒక కేజీ వెండి ధర రూ.1000కి పైగా తగ్గి రూ.62,765కు పడిపోయింది.

విజయవాడ, విశాఖ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.

(చదవండి: ఐదు నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి..!)

మరిన్ని వార్తలు