స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

4 Mar, 2023 11:10 IST|Sakshi

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్లు, ఇటు పండగల సీజన్‌తో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.50 పెరిగి రూ.57,870 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.600 పెరిగి.. ప్రస్తుతం రూ.66,540 వద్ద ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,870గా ఉంది. కిలో వెండి ధర రూ.66,540 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ  రూ.52,430 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200 కి చేరింది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450 కి చేరింది.

విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,870 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,540గా ఉంది.

వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,870 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,540 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.51,900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధరరూ.56,600 గా నమోదైంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 51,800 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,500 గా ఉంది. 

మైసూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 51,800 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500 గా ఉంది. 

పుణెలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 51,750 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,450 గా ఉంది.

మరిన్ని వార్తలు