బంగారం ధర మళ్లీ పెరిగింది.. ఈ రోజు ఎంతంటే?

1 Mar, 2023 10:29 IST|Sakshi

దేశంలో బంగారం ధర మరోసారి పెరిగింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. వెండి ధరలు మాత్రం హెచ్చు తగ్గులు కనిపించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్‌) ప్రకారం దేశంలో వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.   

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,270 నుంచి రూ.56,440కి చేరింది

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,120 నుంచి రూ.56,290కి చేరింది

చెన్నైలో బంగారం ధర స్థిరంగా ఉంది. ఫిబ్రవరి 28న  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,070.. ఇవ్వాళ సైతం అదే ధర కొనసాగుతుంది.  

కోల్‌కతాలో అదే 10 గ్రాముల బంగారం రూ.56,120 నుంచి రూ.56,290కి చేరింది

బెంగళూరులో 10 గ్రాముల బంగారం ధర రూ.56,170 నుంచి రూ.56,340కి చేరింది

హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,120 నుంచి రూ.56,290కి చేరింది.


దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేజీల్లో  వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 66,800లతో స్థిరంగా ఉంది. 

ముంబైలో సైతం వెండి ధరల్లో మర్పు చోటు చేసుకోలేదు. అక్కడ సిల్వర్‌ ధర ప్రస్తుతం రూ.66,800గా ఉంది

చెన్నైల్లో కేజీ వెండి ధర రూ.69,000 నుంచి రూ.69,200కి చేరింది

కోల్‌కతాలో కేజీ వెండి ధర రూ.66,800తో  స్థిరంగా ఉంది.  

బెంగళూరులో కేజీ వెండి ధర రూ.69,000 నుంచి రూ.69,200కి పెరిగింది. 

అహ్మదాబాద్‌లో సైతం స్థిరంగా రూ.66,800తో కొనసాగుతుంది. 

హైదరాబాద్‌లో రూ.69000 గా ఉన్న వెండి ధర రూ.69,200కి చేరింది. 

మరిన్ని వార్తలు