బంగారం, వెండి..  వెనకడుగు

11 Aug, 2020 10:10 IST|Sakshi

ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ. 353 డౌన్‌

అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాముల ధర రూ. 54,593కు

రూ. 576 క్షీణించిన కేజీ వెండి ధర  

రూ. 74,818 వద్ద ట్రేడవుతున్న సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ 

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 2,029 డాలర్లకు

స్పాట్‌ మార్కెట్లో 2,019 డాలర్ల వద్ద ట్రేడింగ్‌

దేశ, విదేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు డీలా పడ్డాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ. 353 క్షీణించి రూ. 54,988కు చేరింది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ వెండి కేజీ రూ. 576 తగ్గి రూ. 74,818 వద్ద వద్ద ట్రేడవుతోంది. వారాంతాన తొలుత బంగారం, వెండి ధరలు ఎంసీఎక్స్‌ చరిత్రలో సరికొత్త గరిష్టాలను సాధించగా.. చివర్లో తోకముడిచిన సంగతి తెలిసిందే. తిరిగి సోమవారం బలపడినప్పటికీ తిరిగి నేటి ట్రేడింగ్‌లో బలహీనపడటం గమనార్హం!

కామెక్స్‌లోనూ
ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 11 డాలర్లు(0.5 శాతం) నీరసించి 2,029 డాలర్ల వద్ద కదులుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 8 డాలర్లు తక్కువగా 2,019 డాలర్లకు చేరింది. ఈ బాటలో వెండి ఔన్స్‌ 0.8 శాతం నష్టంతో 29.04 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా, చైనా మధ్య వివాదాల నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడటం పసిడి ధరలకు చెక్‌ పెట్టినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు గత మూడు వారాలలోనే పసిడి ధరలు 14 శాతం ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపడుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో బంగారం ధరలు డీలాపడినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు