Gold Prices: మళ్లీ పెరుగుతున్న ధరలు

11 Jun, 2021 11:54 IST|Sakshi

అంతర్జాతీయంగా ఊపందుకుంటున్న పుత్తడి ధర

దేశీయంగా స్వల్పంగా పెరిగిన పసిడి ధర

1000 రూపాయలు ఎగిసిన కిలో వెండి

సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల దన్నుతో పుత్తడి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. శుక్రవారం అంతర్జాతీయంగా యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి బంగారం ధరలు ఔన్స్‌ ధర 1,902.90 డాలర్లకు చేరుకుంది. ఆగస్టు 5 డెలివరీ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో బంగారు ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 49,346 రూపాలు పలుకుతోంది. డాలరు బలహీనం,  బ్లాండ దిగుమతి పుత్తడి ధరలను ఊతమిస్తోంది. మరోవైపు  ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న అంచనాల మధ్య ఫెడరల్ రిజర్వ్ సరళ ద్రవ్య విధానం సరిపోదని విశ్లషకులు భావిస్తున్నారు.

ఇండియా బులియన్ అండ్‌ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) అధికారిక ట్విటర్‌ సమాచారం ప్రకారం స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల  బంగారం 10 గ్రాములకు  రూ. 48,750 వద్ద ఉంది.  22 క్యారెట్ల  పసిడి పది గ్రాములకు రూ. 47,090, 18 క్యారెట్ల బంగారం రూ. 39,000 గాను ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,300గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950  ఉంది.  హైదరాబాద్ మార్కెట్లో 300 రూపాయలు ఎగిసిన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 50,500 వద్ద,  22 క్యారెట్ల బంగారం 10 గ్రా ధర రూ.46,100గా ఉంది. 

1000 రూపాయలు పెరిగిన కిలో వెండి ధర
రాజధాని నగరంలో వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 71224  రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో ఏకంగా 1000 రూపాయలు ఎగిసింది. కిలో వెండి రూ. 77100 గా ఉంది.  కాగా గత వారం 10 గ్రాముల బంగారం ధర 49,700 రూపాయల వద్ద ఐదు నెలల గరిష్ట స్థాయిని తాకిన తరువాత బంగారం ధరలు దిగొచ్చాయి. వరుసగా సెషన్లలో క్షీణించి రికార్డు స్థాయి నుంచి సుమారు 7వేల రూపాయలు మేర పడిపోయింది. అయితే 49500 స్థాయిల వద్ద రెసిస్టెన్స్‌ ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అంచనాలకు అనుగుణంగానే పసిడి ధర మళ్లీ పుంజుకుంటోంది.

చదవండి: Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ!
stockmarkets: రికార్డుల మోత 

మరిన్ని వార్తలు