పసిడి, వెండి ధరల మెరుపులు

3 Dec, 2020 10:38 IST|Sakshi

ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 49,200కు

ఎంసీఎక్స్‌లో వెండి కేజీ రూ. 63,672 వద్ద ట్రేడింగ్‌

కామెక్స్‌లో 1,838 డాలర్ల వద్ద కదులుతున్న పసిడి

24.15 డాలర్ల వద్ద ట్రేడవుతున్న ఔన్స్‌ వెండి 

న్యూయార్క్/ ముంబై: వరుసగా మూడో రోజు దేశ, విదేశీ మార్కెట్లో పసిడి, బంగారం ధరలు జోరు చూపుతున్నాయి. నవంబర్‌ నెలలో నమోదైన నష్టాలను పూడ్చుకుంటూ మంగళవారం పసిడి 1800 డాలర్లను అధిగమించడంతో మరింత బలపడే వీలున్నట్లు బులియన్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే సాంకేతికంగా చూస్తే ఇంతక్రితం బ్రేక్‌డౌన్ అయిన 1851 డాలర్ల వద్ద బంగారానికి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని అంచనా వేశారు. ఈ స్థాయిల నుంచి ఒకవేళ బలహీనపడితే తొలుత 1801 డాలర్ల వద్ద, తదుపరి జులై కనిష్టం 1756 డాలర్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు రెండున్నరేళ్ల కనిష్టానికి చేరడం, సెకండ్‌వేవ్‌లో భాగంగా కరోనా కేసులు పెరుగుతుండటం, యూఎస్‌ ప్యాకేజీపై అంచనాలు తాజాగా పసిడికి జోష్‌నిస్తున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. నేటి ట్రేడింగ్‌ వివరాలు ఇలా.. 
 
హుషారుగా..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 253 పెరిగి రూ. 49,200 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 49,270 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 49,136 వద్ద కనిష్టం నమోదైంది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్‌ సైతం రూ. 347 బలపడి రూ. 63,672 వద్ద కదులుతోంది. తొలుత రూ. 63,860 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 63,515 వరకూ వెనకడుగు వేసింది. 

లాభాలతో..
న్యూయార్క్‌ కామెక్స్‌లో వరుసగా మూడో రోజు బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 0.45 శాతం పుంజుకుని 1,838 డాలర్లను తాకింది. స్పాట్‌ మార్కెట్లో 0.2 శాతం లాభంతో 1,835 డాలర్లను అధిగమించింది. వెండి సైతం 0.3 శాతం లాభంతో ఔన్స్ 24.15 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్‌ ధరలు.

మరిన్ని వార్తలు