ఆల్‌టైం హై నుంచి రూ . 6500 తగ్గుముఖం

25 Sep, 2020 18:26 IST|Sakshi

ఐదు రోజుల్లో నాలుగుసార్లు తగ్గిన పసిడి

ముంబై : గత కొద్దిరోజులుగా దిగివస్తున్న బంగారం ధరలు శుక్రవారం కూడా భారీగా పతనమయ్యాయి. డాలర్‌ బలోపేతంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు ఒత్తిడికి లోనవడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో శుక్రవారం పదిగ్రాముల పసిడి 408 రూపాయలు తగ్గి 49,496 రూపాయలకు దిగివచ్చింది.

ఇక కిలో వెండి ఏకంగా 1506 రూపాయలు పతనమై 58,123 రూపాయలకు తగ్గింది. గత ఐదు రోజుల్లో బంగారం ధరలు నాలుగోసారి తగ్గాయి.ఇక గత నెల గరిష్టస్ధాయి నుంచి పసిడి ధరలు 6500 రూపాయలు తగ్గడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌గోల్డ్‌ ఔన్స్‌కు 0.2 శాతం పతనమై 1864 డాలర్లు పలికింది. చదవండి : ఊరట : దిగివస్తున్న బంగారం ధరలు

మరిన్ని వార్తలు