మెరుస్తున్న పసిడి, వెండి ధరలు 

12 Nov, 2020 10:05 IST|Sakshi

రూ. 50,265 వద్ద ట్రేడవుతున్న 10 గ్రాముల బంగారం

ఎంసీఎక్స్‌లో రూ. 62,600 వద్ద కదులుతున్న వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,869 డాలర్లకు

24.35 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

న్యూయార్క్/ ముంబై : నేటి ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. న్యూయార్క్‌ కామెక్స్‌లో 0.4 శాతం పుంజుకోగా.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో అక్కడక్కడే అన్నట్లుగా ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో బుధవారం పసిడి సుమారు రూ. 300, వెండి రూ. 600 చొప్పున బలపడ్డాయి. కాగా.. పసిడికి రూ. 50,000- 49,800 స్థాయిలో సపోర్ట్‌ లభించగలదని బులియన్‌ విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే విధంగా రూ. 51,380- 51,550 స్థాయిలో రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని పేర్కొన్నారు. ఈ బాటలో వెండికి రూ. 61,800- 61,200 వద్ద మద్దతు లభించే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక రూ. 63,100- 63,800 స్థాయిలో వెండికి అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. వివరాలు చూద్దాం..

ఫ్లాట్‌గా..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 96 లాభపడి రూ. 50,265 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,347 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,265 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ నామమాత్రంగా రూ. 59 పెరిగి రూ. 62,600 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,827 వరకూ బలపడిన వెండి తదుపరి రూ. 62,552 వరకూ నీరసించింది. 

లాభాలతో
న్యూయార్క్‌ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. ఔన్స్‌(31.1 గ్రాములు) 0.4 శాతం లాభంతో1,869 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.26 శాతం బలపడి 1,870 డాలర్లకు చేరింది. వెండి 0.35 శాతం పుంజుకుని ఔన్స్ 24.35 డాలర్ల వద్ద కదులుతోంది. 

మరిన్ని వార్తలు