క్షీణ పథంలో పసిడి, వెండి

23 Sep, 2020 10:09 IST|Sakshi

ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 49,976కు

ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 1,890 మైనస్

‌రూ. 60,000 దిగువన ట్రేడవుతున్న వెండి 

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,892 డాలర్లకు

24 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

ఇటీవల క్షీణ పథంలో కదులుతున్న బంగారం, వెండి ధరలు మరోసారి వెనకడుగు వేస్తున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్‌ డాలరు బలపడుతూ వస్తోంది. తాజాగా ఆరు వారాల గరిష్టానికి చేరింది. ఇది పసిడి, వెండి ధరలను దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వివరాలు చూద్దాం..

పతన బాటలో
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 405 క్షీణించి రూ. 49,976 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 1,890 పతనమై రూ. 59,323 వద్ద కదులుతోంది.

చివరికి నష్టాలే
లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ ఎంసీఎక్స్‌లో మంగళవారం బంగారం, వెండి ధరలు చివరికి డీలా పడ్డాయి. 10 గ్రాముల పుత్తడి రూ. 90 క్షీణించి రూ. 50,381 వద్ద ముగిసింది. తొలుత 50,686 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,129 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 103 తగ్గి రూ. 61,213 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 61,990 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 59,570 వరకూ నీరసించింది.  

నేలచూపులో 
న్యూయార్క్‌ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి  ధరలు తిరిగి డీలా పడ్డాయి. ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.8 నీరసించి 1,892 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.6 శాతం బలహీనపడి 1,889 డాలర్ల దిగువకు చేరింది.  వెండి ఔన్స్ 2 శాతం పతనమై 24 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

మరిన్ని వార్తలు