అటూఇటుగా పసిడి, వెండి ధరలు

30 Oct, 2020 12:03 IST|Sakshi

రూ. 50,435 వద్ద కదులుతున్న 10 గ్రాముల బంగారం

ఎంసీఎక్స్‌లో రూ. 60,068 వద్ద ట్రేడవుతున్న కేజీ వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,869 డాలర్లకు

23.28 డాలర్ల వద్ద ట్రేడవుతున్న ఔన్స్‌ వెండి

సెకండ్‌వేవ్‌లో భాగంగా అమెరికా, యూరోపియన్‌ దేశాలలో కోవిడ్‌-19 కేసులు ఉధృతంకావడంతో రెండు రోజులుగా డీలాపడ్డ పసిడి ధరలు నామమాత్రంగా కోలుకున్నాయి. అయితే వెండి ధరలు మరోసారి వెనకడుగు వేస్తు‍న్నాయి. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్యాకేజీని ఆమోదించడంలో యూఎస్‌ కాంగ్రెస్‌ విఫలంకావడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ బలపడటం వంటి అంశాలు పసిడిని దెబ్బతీస్తున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. వివరాలు చూద్దాం..

మిశ్రమ బాట
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం  రూ. 153 లాభపడి రూ. 50,435 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో 50,525 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 50,353 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 104 క్షీణించి రూ. 60,068 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 60,665 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 59,918 వరకూ క్షీణించింది. 

కామెక్స్‌లో..
న్యూయార్క్‌ కామెక్స్‌లో గత రెండు రోజుల్లో క్షీణ పథం పట్టిన బంగారం ధరలు ప్రస్తుతం స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి నామమాత్రంగా బలపడి 1,869 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లో 0.2 శాతం పుంజుకుని 1,871 డాలర్లకు చేరింది. వెండి 0.4 శాతం క్షీణించి ఔన్స్ 23.28 డాలర్ల వద్ద కదులుతోంది. 

వెనకడుగు..
ఎంసీఎక్స్‌లో గురువారం 10 గ్రాముల బంగారం రూ. 221 క్షీణించి రూ. 50,274 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 50,617 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,070 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 3 తక్కువగా రూ. 60,135 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 60,735 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 58,381 వరకూ వెనకడుగు వేసింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా