గేమింగ్, క్యాసినోలపై జీఎస్‌టీ ఉంటుందా? లేదా?

13 Aug, 2022 11:26 IST|Sakshi

ఆర్థిక మంత్రుల ప్యానెల్‌ నివేదిక సిద్ధం

రెండు రోజుల్లో ఆర్థిక మంత్రి చేతికి  

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్, క్యాసినోలపై పన్ను పెంచాలన్న ప్రతిపాదనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్‌ తన పని పూర్తి చేసింది. నివేదికను రెండు రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందించనుంది. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. మంత్రుల గ్రూపు సమర్పించే నివేదికపై ఈ నెల చివర్లో లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో భేటీ అయ్యే జీఎస్‌టీ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.

చదవండి:Kia Seltos:కియా మరోసారి అదరగొట్టింది,సెల్టోస్‌ కొత్త రికార్డు

గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ గేమింగ్, క్యాసినోల స్థూల వ్యాపారంపై 28 శాతం జీఎస్‌టీ విధించాలని లోగడ మంత్రుల గ్రూపు సిఫారసు చేయడం గమనార్హం. దీన్ని ఆయా పరిశ్రమలు వ్యతిరేకిస్తున్నాయి. క్యాసినోలపై పన్నును 28 శాతానికి పెంచడం పట్ల మరోసారి చర్చించాల్సి ఉందంటూ గోవా కోరింది. దీంతో మరింతగా చర్చించి నివేదిక ఇవ్వాలని మంత్రుల బృందాన్ని జీఎస్‌టీ కౌన్సిల్‌ కోరడం గమనార్హం. ఇందులో భాగంగా పరిశ్రమకు చెందిన భాగస్వాములతో మంత్రుల బృందం సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తీసుకుంది.

చదవండి: Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్‌ అనాల్సిందే!

మరిన్ని వార్తలు