సంక్షోభ సమయంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ గుడ్‌న్యూస్‌

31 Mar, 2023 10:51 IST|Sakshi

సాక్షి, ముంబై: గ్లోబల్‌గా ఐటీ రంగంలో కొనసాగుతున్న తొలగింపుల మధ్య, భారతీయ ఐటీ మేజర్‌ చల్లటి కబురు చెప్పింది.  కొంతమంది  ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించినట్టు హెచ్‌సీఎల్‌ టెక్‌ తాజాగా ప్రకించింది.  రాబోయే రెండేళ్లలో రొమేనియాలో 1,000 మంది ఉద్యోగులను నియమించు కోనున్నట్లు ప్రకటించింది. రొమేనియాలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో  ప్రముఖ రోమేనియన్ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ద్వారా మూడో వంతు చోటు కల్పించనుంది. 

హెచ్‌సీఎల్‌టెక్గత ఐదేళ్లుగా రొమేనియాలో పనిచేస్తోంది.ఈ నేపథ్యంలోనే గ్లోబల్ క్లయింట్‌లకు సేవలందించేలా ఇప్పటికే దేశంలో దాదాపు 1,000 మంది ఉద్యోగులుండగా, మరో వెయ్యిమందిని చేర్చుకోనుంది. ఐటీ సేవల్లో వృద్ధిని కొనసాగించేందుకు స్థానిక ప్రతిభావంతులకు మరిన్ని అవకాశాలను సృష్టించేందుకు కంపెనీ బుకారెస్ట్, ఇయాసిలో ఉద్యోగులను పెంచుకుంది. తమకు రొమేనియా కీలకమైన మార్కెట్‌ అని అందుకే మరింత మెరుగైన సేవలందించేలా వర్క్‌ఫోర్స్‌ను పెంచుకుంటు న్నామని  ఐడీసీ  అసోసియేట్ కన్సల్టెంట్ అలెగ్జాండ్రా సిమియన్  వెల్లడించారు.  (హయ్యస్ట్‌ సాలరీతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్‌ కొట్టేసిన అవని మల్హోత్రా)

రొమేనియాలో స్థానిక ప్రతిభావంతులకు సాంకేతికతలో వృత్తిని కొనసాగించేందుకు అవకాశాలను సృష్టించేందుకు పెట్టుబడులు పెడుతున్నామని  అక్కడి  కంట్రీ లీడ్ ఇలియాన్ పదురారు అన్నారు.  ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం,  ఎంట్రీ లెవల్లోవారిని నియమించుకోవడానికి కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. (ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్‌ వచ్చేస్తోంది..150 కి.మీ. రేంజ్‌లో)

 కాగా  గూగుల్, అమెజాన్ , మెటా గత ఏడాది చివర్లో  భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినసంగతి తెలిసిందే. గూగుల్  12వేలు,  మెటా, అమెజాన్‌లు వరుసగా 21వేలు, 27వేల మంది ఉద్యోగాలపై వేటు వేశాయి. 
 

మరిన్ని వార్తలు