‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్’ ఉద్యోగులకు శుభవార్త..‌

27 Sep, 2020 20:20 IST|Sakshi

ముంబై: కరోనా ఉదృతి నేపథ్యంలో మెజారిటీ ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌(ఇంటి నుంచి పని)కు వెసులుబాటు కల్పించాయి. కాగా ప్రస్తుతం వర్క్‌ ప్రమ్‌ హోమ్‌ ద్వారా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో ఆఫిస్‌లో పనిచేసేటప్పుడు సహ ఉద్యోగులతో కలిసి కాసేపు రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉండేది. ప్రాజెక్ట్‌ ఒత్తిడి సమయంలో ఆఫీస్‌లో టీ, కాఫీలు సేవించేవారు. ఏదయినా ప్రాజెక్ట్‌కు సంబంధించిన సమస్య ఉంటే సహ ఉద్యోగులతో చర్చించి పరిష్కారాన్ని కనుగొనే వారు. ఈ సమస్యలను గుర్తించిన ఐటీ కంపెనీల యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో ఉద్యోగులకు పండగల (దీపావళి) టైయ్‌లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో  వచ్చే సమస్యలను చర్చించి, ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలని తెలిపారు.

ఉద్యోగులకు పండగ వేళ రిలాక్స్‌ కోసం ఐటీ యాజమాన్యాలు ఒత్తిడి నియంత్రణ ప్రోగ్రామ్స్‌ను ప్లాన్‌ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం నెలకు రెండు లీవ్‌లను కంపెనీలు అనుమతిస్తున్నాయి.  గతంలో ఉద్యోగులు ప్రతి నెల లభించే లీవ్‌లను ఉపయోగించుకోకుండా ఏడాది చివరిలో ఒకేసారి భారీగా లీవ్‌లు తీసుకునే వారు. కానీ ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఉద్యోగులు ఒంటరిగా తమ డ్యూటీలు చేస్తున్నారు. అందువల్ల ఉద్యోగులు రిలాక్స్‌ కావడానికి యాజమాన్యాలు ప్రతి నెల లీవ్‌లు పెట్టుకోవడానికి అనుమతిస్తున్నాయి. (చదవండి: వర్క్‌ ఫ్రం హోమ్‌ ఎప్పటికీ కొనసాగుతుంది)

>
మరిన్ని వార్తలు