మైక్రోసాఫ్ట్‌ గుడ్‌ న్యూస్‌: సైబర్‌ సెక్యూరిటీలో వారికి ప్రత్యేక శిక్షణ

28 Apr, 2023 14:12 IST|Sakshi

ప్రపంచంలోనే అతి పెద్దఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ మహిళలకు శుభవార్త అందించింది. లక్షమందికి సైబర్‌ సెక్యూరిటీ శిక్షణను అందించేందుకు ముందుకొచ్చింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్ల సైబర్‌ సెక్యూరిటీ ఉద్యోగాలు భర్తీ కావచ్చన్న అంచనాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.  ప్రధానంగా Ready4Cybersecurity ప్రోగ్రామ్, దాని గ్లోబల్ సైబర్‌సెక్యూరిటీ స్కిల్లింగ్ ఇనిషియేటివ్‌లో ఈ శిక్షణను ఇవ్వనుంది. 

రానున్న ఎనిమిదేళ్లలో సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల డిమాండ్‌ 350 శాతం పెరగనుంది. దీంతో యువతుల్లో సైబర్‌ సెక్యూరిటీ నైపుణ్యాలను పెంచేందుకు ప్రయత్నిస్తోంది మైక్రోసాఫ్ట్‌. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికేట్లను ప్రదానం చేయనుంది. సైబర్‌ సెక్యూరిటీలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, నైపుణ్య విషయంలో అంతరాల్ని   పూరించడం,  విభిన్న సైబర్‌ సెక్యూరిటీ వర్క్‌ఫోర్స్‌ను నిర్మించడమే తమ లక్క్ష్యమని సంస్థ పేర్కొంది.

(ఇదీ చదవండి:  నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్​: టెక్‌ సీఈవోలు, ఐపీఎల్‌ ఆటగాళ్లను మించి .!)

మైక్రోసాఫ్ట్ డిజిటల్ డిఫెన్స్ రిపోర్ట్ ప్రకారం, 2022లో పాస్‌వర్డ్ ఎటాక్ ఘటనలు ప్రతి సెకనుకు 921కు పెరిగింది. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే ఇది 74శాతం పెరిగింది. తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న సైబర్ దాడులనష్టం 4.35 మిలియన్ల డాలర్లుగా ఉంది. మరోవైపు గ్లోబల్‌గా సైబర్‌ సెక్యూరిటీ వర్క్‌ఫోర్స్‌లో మహిళలు కేవలం 25 శాతం మాత్రమే ఉన్నందున, వీరిని ప్రోత్సహించేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.  (Vanisha Mittal Amit Bhatia Love Story: వనీషా...అమిత్‌ లవ్‌ స్టోరీ తెలుసా? ఈ లవ్‌ బర్డ్స్‌ పెళ్లి ఒక రికార్డ్‌  )

మరిన్ని వార్తలు