Google: ఓల్డ్‌తో పాటు బ్లర్‌ ఫొటోల్ని హైరెజల్యూషన్‌కు మార్చే టెక్నాలజీ వచ్చేసింది

2 Sep, 2021 12:40 IST|Sakshi

ఫొటోల్ని భద్రంగా దాచుకోవడం పెద్ద సవాల్‌గా ఫీలవుతుంటారు చాలామంది. ఆల్బమ్‌కు అత్కుకుపోవడం, మరకలు, చినుగుళ్లు.. ఇలాంటివి గుర్తులను చెరిపేసే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే ఆ పాత ఫొటోల్ని క్వాలిటీగా మార్చేందుకు రెండు పెయిడ్‌ మోడల్స్‌ను తీసుకొచ్చింది గూగుల్‌. గూగుల్‌ అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ బ్లాగ్‌ ద్వారా ఇమేజ్‌ సూపర్‌ రీ-సొల్యూషన్‌(ఎస్‌ఆర్‌3), కాస్‌కాడెడ్‌ డిఫుషన్‌ మోడల్స్‌(సీడీఎం) పేరుతో మోడల్స్‌ను రిలీజ్‌ చేసింది. 

ఈ టెక్నాలజీ ద్వారా పాత తరం ఫొటోల్ని క్వాలిటీ మోడల్స్‌లోకి మార్చడంతో పాటు బ్లర్‌ ఇమేజ్‌లను హై రెజల్యూషన్‌ మోడ్‌లోకి మార్చేయొచ్చు. ఇమేజ్‌ సూపర్‌ రెజల్యూషన్‌(ఎస్‌ఆర్‌3).. లో రెజల్యూషన్‌ ఫొటోల్ని హైరెజల్యూషన్‌కు మారుతుంది. బాగా డ్యామేజ్‌, మరకలు ఉన్న పాత ఫొటోల్ని సైతం క్లారిటీ మోడ్‌కు తీసుకొస్తుంది. మల్టీపుల్‌ అప్లికేషన్స్‌తో పనిచేసే ఈ టెక్నాలజీకి సంబంధించి డెమోను సైతం బ్లాగ్‌లో ఉంచింది గూగుల్‌ ఏఐ. చదవండి: దేశంలో VPN బ్యాన్‌?
 

కాస్‌కాడెడ్‌ డిఫుషన్‌ మోడల్స్‌(సీడీఎం).. ఫొటోల్ని సహజంగా అందంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగించే టెక్నాలజీ ఇది. ఇంతకు ముందు ఉన్న ఇమేజ్‌నెట్‌ కష్టంగా మారడంతో.. ఈ కొత్త మోడల్‌ను డెవలప్‌ చేసినట్లు పేర్కొంది గూగుల్‌. ఇమేజ్‌ రెజల్యూషన్‌ను పెంచడంతో పాటు ఫొటోల్ని నేచురల్‌గా చూపించనుంది ఈ ఏఐ మోడల్‌. ఈ రెండింటితో పాటు అగుమెంటేషన్‌ టెక్నిక్‌ ‘కండిషనింగ్‌ అగుమెంటేషన్‌’ను సీడీఎంకు సమానంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది గూగుల్‌. 64x64 రెజల్యూషన్‌ ఈమేజ్‌ను 264x264 రెజల్యూషన్‌కి, ఆపై 1024x1024కి మార్చనుంది సీడీఎం మెథడ్‌. అయితే పాత ఫొటోల్ని క్వాలిటీకి మార్చే క్రమంలో.. డిజైన్‌ విషయంలో కొన్ని సవాళ్లు ఎదురు కానున్నాయని, వాటిని అధిగమించే ప్రయత్నం చేయనున్నట్లు గూగుల్‌ ఏఐ బ్లాగ్‌ పేర్కొంది.

చదవండి:  వర్క్‌ఫ్రమ్‌ హోంపై గూగుల్‌ కీలక ప్రకటన

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు