గూగుల్‌ అనలిటిక్స్‌ డౌన్‌...! యూజర్లకు భారీ షాక్‌..!

18 Oct, 2021 21:02 IST|Sakshi

పలు బ్లాగింగ్‌ సైట్లకు, న్యూస్‌ వెబ్‌సైట్లకు గూగుల్‌ భారీ షాకిచ్చింది. గూగుల్‌ అనలిటిక్స్‌ సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మూగబోయింది. గూగుల్‌ అనలిటిక్స్‌ ఒక్కసారిగా డౌన్‌ అవ్వడంతో పలు యూజర్లు ట్విటర్‌లో గగ్గోలు పెట్టారు. గూగుల్‌ అనలిటిక్స్‌ పనిచేయడం లేదంటూ ట్విటర్‌లో షేర్‌ చేశారు. రియల్‌ టైం వ్యూస్‌ పూర్తిగా జీరోకు చేరుకుందని యూజర్లు ట్విటర్లో పేర్కొన్నారు.గూగుల్‌ అనలిటిక్స్‌ డౌన్‌ విషయంపై గూగుల్‌ ఇంకా స్పందించాల్సి ఉంది.  

గూగుల్‌ అనలిటిక్స్‌ ఏం చేస్తుందంటే...!
నేటి డిజిటల్‌ ప్రపంచంలో పలు వెబ్‌సైట్లకు, బ్లాగింగ్‌ సైట్లకు గూగుల్‌ అనలిటిక్స్‌ ముఖ్యమైన టూల్‌. ఈ టూల్‌ను ఉపయోగించి  ఆయా వెబ్‌సైట్లకు ఎంత మేర ట్రాఫిక్‌(యూజర్లు) వస్తూందనే విషయాన్ని తెలుసుకోవచ్చును. అంతేకాకుండా పలు సైట్లకు సంబంధించిన యూజర్ల సెషన్ వ్యవధి, ప్రతి సెషన్‌కు పేజీలను, బౌన్స్ రేటు మొదలైన వెబ్‌సైట్ కార్యకలాపాలను గూగుల్‌ అనలిటిక్స్‌ ట్రాక్ చేస్తుంది.

మరిన్ని వార్తలు