-

Escape From Taliban: అఫ్గన్‌లకు ఇప్పుడు ఇవే దిక్కు

19 Aug, 2021 15:40 IST|Sakshi

అఫ్గన్‌ అల్లకల్లోలం గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి జనాభాలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాణభీతితో పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు జనాలు. ఈ తరుణంలో  వారు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారని ఎంఐటీ రివ్యూ వెల్లడించింది.

గూగుల్‌ ఫామ్స్‌
గూగుల్‌, వాట్సాప్‌.. ఇప్పుడు తాలిబన్ల కంటపడకుండా తప్పించుకునేందుకు అఫ్గన్‌లకు మార్గనిర్దేశకాలుగా మారాయి. జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు.. ఆఫ్గన్‌ల పేర్లతో ఆన్‌లైన్‌ లిస్ట్‌లు తయారుచేసి సాయం అందిస్తున్నారు. మరికొన్ని గ్రూపులు తాలిబన్ల కదలికల ఆధారంగా ఎలా వెళ్లాలో అఫ్గన్‌ పౌరులకు సూచనలు చేస్తున్నాయి. వీటిలో చాలావరకు కాబూల్‌ నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు అక్కడి పౌరులకు సాయపడుతున్నాయి. ఇందుకోసం గూగుల్‌ ఫామ్స్‌ను సర్క్యులేట్‌ చేస్తున్నారు. 

నిఘా సూచనలు
ప్రశ్నలు..వాటికి సమాధానాలు అందించడం కోసం గూగుల్‌ ఫామ్స్‌ చాలా తేలికైన వ్యవహారం. అంతేకాదు అందులోనే పౌరుల పూర్తి సమాచారం మొత్తం పొందుపరుస్తున్నారు. ఇక వాట్సాప్‌లోనూ సమాచారం ఫార్వర్డ్‌ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. స్థానిక గ్రూపులతో పాటు అమెరికా విభాగాలు సైతం.. ఈ-మెయిల్స్‌ ద్వారా కాకుండా వాట్సాప్‌ గ్రూపులనే ఉపయోగించుకోవాలని సూచిస్తున్నాయి.

మిగతావి కష్టం
ఓవైపు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌ తాలిబన్ల కంటెంట్‌ కట్టడికి ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ ఇవి సులువుగా ఉపయోగించుకుంటున్నారు తాలిబన్లు. దీంతో వీటిలో ఎలాంటి అప్‌డేట్స్‌ పెట్టొద్దని అఫ్గన్‌లకు సూచనలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్‌ ఫామ్స్‌, వాట్సాప్‌ గ్రూపుల వినియోగం పెరిగింది.

చదవండి: Afghanistan Trade: తాలిబన్ల ఎఫెక్ట్‌.. భారత్‌కు ఇక భారీ దెబ్బే!

మరిన్ని వార్తలు