2021 భారత్‌లో నిలిచిన బెస్ట్‌ యాప్స్‌ ఇవే..! మీరు వాడే యాప్స్‌ ఉన్నాయో లేదో  చెక్‌ చేయండి..! 

30 Nov, 2021 17:29 IST|Sakshi

Google Best Android Apps, Games of 2021 in India: స్మార్ట్‌ఫోన్‌..! ఏ ముహుర్తాన వచ్చిందో కానీ...అది లేకుండా బతకలేకపోయే రోజులు వచ్చాయి. లేవడంతోనే వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, జీ మెయిల్‌ ఇలా రకరకాల యాప్స్‌కు వచ్చే నోటిఫికేషన్స్‌ను చూసుకోవడం మన దినచర్యగా మారిపోయింది. మనకు ఉపయోగపడే యాప్స్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటూ వాటి సేవలను పొందుతాం. మనం వాడుతున్న యాప్స్‌లో బెస్ట్‌ యాప్‌ ఏదంటే చెప్పడం కాస్త కష్టం. కాగా  ప్రతి ఏడాది అత్యంత ఆదరణను పొందిన యాప్స్‌ లిస్ట్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ రిలీజ్‌ చేస్తుంది. అంతేకాకుండా ఆయా కేటగిరీలో బెస్ట్‌ యాప్స్‌గా నిలిచిన వాటికి అవార్డులను కూడా అందజేస్తుంది.  2021గాను ఇండియాలో బెస్ట్‌ యాప్స్‌ లిస్ట్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ రిలీజ్‌ చేసింది. 

2021గాను భారత్‌లో బెస్ట్‌ యాప్‌గా ‘బిట్‌క్లాస్‌’ నిలిచిందని గూగుల్‌ ప్రకటించింది. బెస్ట్‌ గేమ్‌ కేటగిరీలో బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ అంతేకాకుండా గేమ్స్‌, ఫన్‌, వ్యక్తిగత వృద్ధి,  రోజువారి అవసరాలను తీర్చే కేటగిరీలో బెస్ట్‌ యాప్స్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ ప్రకటించింది.

వినోదాన్ని పంచే బెస్ట్‌ యాప్స్‌

 • ఫ్రంట్‌రో
 • క్లబ్‌హౌస్: సోషల్ ఆడియో యాప్
 • హాట్స్టెప్

రోజువారి అవసరాలకోసం వాడే బెస్ట్‌ యాప్స్‌

 • సోర్టిజీ - వంటకాలు, మీల్ ప్లానర్ & కిరాణా జాబితాలు అందిస్తోంది.
 • సర్వ - యోగా & ధ్యానం
 • ట్రూకాలర్‌

పర్సనల్‌గ్రోత్‌ ఉత్తమ యాప్‌లు

 • బిట్‌క్లాస్‌ (Bitclass)
 • ఎంబైబ్‌: లెర్నింగ్ అవుట్‌కమ్స్ యాప్
 • ఏవాల్వ్‌: ధ్యానాలు, స్వీయ సంరక్షణ & బ్రీతింగ్‌ థెరపీ యాప్‌

బెస్ట్‌ కాంపిటిటీవ్‌ గేమింగ్‌ యాప్స్‌

 • బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా
 • సమ్మనర్స్ వార్: లాస్ట్ సెంచూరియా
 • మార్వెల్ ఫ్యూచర్ రివల్యూషన్
 • పోకీమాన్ యునైట్
 • సస్పెక్ట్‌: మిస్టరీ మాన్షన్

చదవండి: సగం మైక్రోసాఫ్ట్‌ షేర్లు అమ్మేసుకున్న సత్య నాదెళ్ల, కారణం ఏంటంటే..

మరిన్ని వార్తలు