Google Banned 8 Apps: మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా? వెంట‌నే డిలీట్ చేయండి..!

22 Aug, 2021 12:10 IST|Sakshi

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ప్రమాదకరమైన 8 యాప్స్‌ను ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. ఆ యాప్స్‌ను ఫోన్ల నుంచి వెంటనే డిలీట్‌ చేయాలని యూజర్లను హెచ్చరించింది.

టప్‌ మని నీటి బుడగలా పేలిపోయే బిట్‌ కాయిన్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఇంటస్ట్ర్‌ చూపిస్తున్నారు. అయితే ఆ ఇంట్రస్ట్‌ను క్యాష్‌ చేసుకునేందుకు సైబర్‌ నేరస్తులు కొత్త  మార్గాల్ని అనుసరిస్తున్నారు. బిట్‌ కాయిన్‌పై యాప్స్‌ తయారు చేసి వైరస్‌ల సాయంతో యూజర్ల అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. దీంతో గూగుల్‌ ఆయా యాప్స్‌ను ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. 

బిట్‌ఫండ్స్- క్రిప్టో క్లౌడ్ మైనింగ్

బిట్‌కాయిన్ మైనర్- క్లౌడ్ మైనింగ్

వికీపీడియా (BTC)- పూల్ మైనింగ్ క్లౌడ్ వాలెట్

క్రిప్టో హోలిక్- బిట్‌కాయిన్ క్లౌడ్ మైనింగ్

డైలీ బిట్‌ కాయిన్‌ రివార్డ్స్‌ - క్లౌడ్ ఆధారిత మైనింగ్ వ్యవస్థ

బిట్‌కాయిన్ 2021

మైన్‌బిట్ ప్రో - క్రిప్టో క్లౌడ్ మైనింగ్ & బిటిసి మైనర్

ఎథీరియం (ETH) - పూల్ మైనింగ్ క్లౌడ్ 

యాడ్స్‌ను ఎరగా వేసి
సైబర్‌ నేరస్తులు తయారు చేసిన యాప్స్‌ ద్వారా యూజర్ల అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తుంటారని ప్రముఖ సెక్యూరిటీ సంస్థ ట్రెండ్‌ మైక్రో తెలిపింది. ట్రెండ్‌ మైక్రో రిపోర్ట్‌ ప్రకారం.. తొలత సైబర్‌ నేరస్తులు బిట్‌ కాయిన్‌ పై ట్రేడింగ్‌ నిర్వహించేందుకు ఇష్టపడుతున్న వారిని టార్గెట్‌ చేస్తారు.

వారికి రూ.1000తో (ఉదాహరణకు) బిట్‌ కాయిన్‌పై ట్రేడింగ్‌ చేస్తే వారికి అదనంగా రూ.2వేలు చెల్లిస్తామంటూ యాడ్స్‌ను క్రియేట్‌ చేస్తుంటారు. పొరపాటున ఆ యాడ్స్‌ను క్లిక్‌ చేస్తే మన పర్సనల్‌ డేటా అంతా సైబర్‌ నేరస్తుల డేటాలో స్టోరై ఉంటుందని సెక్యూరిటీ సంస్థ తెలిపింది. ఆ తర్వాత యాప్స్  ద్వారా మాల్‌వేర్‌ సాయంతో అకౌంట్లలో ఉన్న డబ్బులు కాజేస్తుంటారని, ఇలాంటి యాప్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.    

చదవండి : Asus Chromebook: మార్కెట్‌లో బాహుబలి ల్యాప్‌ ట్యాప్‌

మరిన్ని వార్తలు