గూగుల్ ప్లే స్టోర్ నుంచి 29 యాప్స్ తొలగింపు

29 Jul, 2020 13:32 IST|Sakshi

యాడ్‌వేర్‌(యూజర్‌ ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ చేసే సాఫ్ట్‌వేర్)తో నిండిన 29 యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి గూగుల్‌ తొలగించింది. ఈ యాప్స్‌ అండ్రాయిడ్‌ ప్లే స్టోర్‌లో 3.5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌ అయి ఉన్నాయి. సతోరి ఇంటెలిజెన్స్ బృందం చార్ట్రూస్బ్లూర్‌ పేరుతో జరిపిన పరిశోధనలో భాగంగా ఈ 29 యాప్‌లను కనుగొన్నారు. వీటిలో అధికంగా ఫోటో ఎడిటింగ్‌ యాప్‌లు ఉన్నట్లు తేలింది. దర్యాప్తులో యాప్స్‌లో బ్లర్ అనే పదం చాలా హానికరమైనదగా తేలింది. (10 లక్షలకు పైగా డౌన్‌లోడ్లతో టాప్‌లో)

ఈ ఆండ్రాయిడ్ యాప్స్‌లో వినియోగంలోని లేని యాడ్స్‌  ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వీటిలో ఏ యాప్‌ అయినా యూజర్‌ ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు మొబైల్‌లో లాంచ్‌ ఐకాన్స్‌ ఫోన్ నుంచి వెంటనే కనిపించకుండా పోతాయి. దీని ద్వారా యూజర్‌ ఈ యాప్‌లను డిలీట్‌ చేయడానికి క‌ష్టంగా మారుతుంది. యాడ్‌వేర్ ఉన్న ఓ యాప్‌ స్క్వేర్ ఫోటో బ్లర్ యాప్‌. సాటోరి బృందం ఈ యాప్‌ను పరీక్షించింది. ఈ యాప్‌ సరిగా వర్క్‌ చేయడం లేదు. ఫోన్‌లలో ఓసీసీ యాడ్‌లను అమలు చేస్తోంది. ఈ యాప్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసేన తర్వాత లాంచ్‌ ఐకాన్‌ అదృశ్యమైంది. అంతేగాక ప్లే స్టోర్‌లో “ఓపెన్” ఫంక్షన్ కూడా లేదు. (టిక్‌టాక్‌ బ్యాన్‌.. దూసుకుపోతున్న చింగారీ)

ఈ యాప్‌ల ద్వారా కనిపించే ప్రకటనలు కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగిపోతుంటాయి. వీటిలో కొన్ని ఫోన్‌ను అన్‌లాక్ చేయడం, యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయడం, ఫోన్‌ను ఛార్జ్ చేయడం లేదా మొబైల్ డేటా నుంచి వై-ఫైకి మారడం వంటివి ఉన్నాయి. ఇవి ఫోన్ మొత్తం స్క్రీన్‌ను ఆక్రమిస్తాయి. ఇలాంటి హానిరమైన యాడ్‌వేర్‌తో ఇప్పటికి 29 యాప్‌లు గుర్తించడం జరిగింది. కానీ భవిష్యత్తులో వీటి సంఖ్య అధికంగా ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే వీటన్నింటిని తెలుసుకొని అన్‌ ఇన్‌స్టాల్‌ చేయవచ్చు. ఇందుకు సతోరి బృందం కొన్ని సూచనలు, సలహాలు ఇస్తోంది. (పబ్జీ పోయినా ఈ గేమ్స్‌ ఉన్నాయిగా...)

గూగుల్ సంస్థ తన వినియోగదారులకు మరింత భద్రత, మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా 11 యాప్ లను ఇటీవల  ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ లలో ప్రమాదకర జోకర్ మాల్వేర్ వైరస్ ఉండడమే కారణమని చెక్ పాయింట్ అనే సెక్యూరిటీ సొల్యూషన్ సంస్థ తెలిపింది. జోకర్ మాల్వేర్ ఉన్న యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటే, యూజర్ల ప్రమేయం లేకుండానే డేటాలో మార్పులు, చేర్పులు జరుగుతాయని తెలిపింది. వినియోగదారులు వారి మొబైల్స్ చెక్ చేసుకుని.. ఒక వేళ ఈ యాప్స్ ఉంటే వాటిని వెంటనే తొలగించాలని సూచించింది. (చైనాలో కాదు చెన్నైలో)

మరిన్ని వార్తలు