గూగుల్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 30 నుంచి ఆ సేవలు బంద్

21 Jul, 2021 20:38 IST|Sakshi

పాత సేవలను, పెద్దగా వాడని సర్వీసుల్ని గూగుల్‌ గత కొంతకాలంగా మూసేస్తూ వస్తుంది. తాజాగా గూగుల్‌ తన ‘బుక్‌మార్క్స్’ సేవలను కూడా మూసేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరు 30 నుంచి గూగుల్‌ బుక్‌మార్క్స్‌ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. గూగుల్ బుక్ మార్క్స్ వెబ్ సైట్ లో దీనికి సంబంధించిన ఒక బ్యానర్ విడుదల చేసింది. ఆ పోర్టల్ లో సెప్టెంబర్ 30 తేదీ తర్వాత ఈ సేవలకు గూగుల్ ఇకపై సపోర్ట్ ఇవ్వదని పేర్కొంది. ఈ సేవలను 2005లో ప్రవేశపెట్టినప్పటి నుంచి సరైన ప్రజధారణ రాకపోవడంతో నిలిపివేస్తున్నట్లు తెలుస్తుంది.

ముఖ్యంగా, గూగుల్ మ్యాప్స్ లో వినియోగదారుల స్టార్ మార్క్ చేసిన ప్రదేశాలు బుక్‌మార్క్స్ షట్ డౌన్ వల్ల ప్రభావితం కాదని గూగుల్ పేర్కొంది. అవసరమైతే ఈ బుక్‌మార్క్స్ ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు అని తెలిపింది. గూగుల్ బుక్‌మార్క్స్‌ సర్వీస్ నిలిపివేయడాన్ని తన ట్విటర్ ఖాతా షేర్ చేసింది. గూగుల్ "సెప్టెంబర్ 30, 2021 తర్వాత గూగుల్ బుక్ మార్క్లకు ఇకపై సపోర్ట్ ఇవ్వదు" అనే సందేశాన్ని ప్రదర్శించింది. "ఎక్స్ పోర్ట్ బుక్‌మార్క్స్" మీద క్లిక్ చేయడం ద్వారా యూజర్లు తమ బుక్ మార్క్ లను సేవ్ చేసుకోవచ్చు అని కూడా పేర్కొంది. మీకు ఏవైనా బుక్ మార్క్ లు సేవ్ చేయబడ్డాయని చూడటానికి ఇక్కడకు వెళ్లండి. గూగుల్ బుక్ మార్క్స్ సేవ 2005లో ప్రారంభించినప్పుడు ఇది సరికొత్తగా అనిపించింది. వెబ్ సైట్ లో సేవ్ చేయబడ్డ డేటాను సర్చ్ చేయడానికి చాలా ఉపయోగపడింది. యానోటేటింగ్ ఫీచర్లతో పాటు వినియోగదారులు తమ బుక్‌మార్క్స్‌ ను సేవ్ చేయడానికి ఇది క్లౌడ్ స్టోరేజీ సేవను అందించింది.

మరిన్ని వార్తలు