సుందర్ పిచాయ్ క్షమాపణలు

10 Dec, 2020 16:02 IST|Sakshi

కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో ప్రఖ్యాతి గాంచిన ‌గూగుల్ ఉద్యోగి టిమ్‌నిట్‌ గెబ్రూ నిష్క్రమణతో ఆ సంస్థలో పెద్ద దుమారమే రేగింది. తాజాగా గత వారం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు ఆకస్మికంగా కంపెనీ నుండి బయటికి వెళ్లడంతో కంపెనీలో అనేక "సందేహాలకు దారితీసింది" అని గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ చెప్పడంతో పాటు సంస్థకి క్షమాపణలు చెప్పారు. శాస్త్రవేత్త టిమ్నిట్ గెబ్రూ నిష్క్రమణకు దారితీసిన పరిస్థితుల గురించి టెక్ కంపెనీ గూగుల్ సమీక్షిస్తుందని పిచాయ్ చెప్పారు. కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో ప్రఖ్యాతి గాంచిన గెబ్రూ గత వారం ఆమెను తొలగించారని చెప్పారు. గూగుల్ దీనిని రాజీనామాగా పేర్కొంది. "కృత్రిత మేధ(ఏఐ) రంగంలో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ నల్లజాతి మహిళా గెబ్రూ గూగుల్‌ను వదిలిపెట్టినందుకు తమ రాజీనామాని అంగీకరిస్తున్నాము" అని సుందర్ పిచాయ్ చెప్పారు. (చదవండి: ‘వ్యాక్సిన్ల’ పై బ్రెజిల్‌ గుణపాఠం)

గూగుల్ కృత్రిమ మేధ(ఏఐ)తో సామాజిక ప్రమాదాలను పరిశీలిస్తున్న ఓ పరిశోధన పత్రం విషయంలో సంస్థ మేనేజ్‌మెంట్‌కు.. ఆమెకు మధ్య తీవ్ర విబేధాలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఏఐలో రూపుదిద్దుకొంటున్న ఓ కొత్త విభాగం సామాజిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని గెబ్రూ లేవనెత్తడమే వివాదానికి కారణమైనట్లు సమాచారం. ఈ విషయంలో తనను సంస్థ తొలగించిందని గెబ్రూ ప్రకటించగా. గూగుల్ మాత్రం ఆమె రాజీనామా చేసినట్లు పేర్కొంది. దింతో ఈ వివాదం బయటకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో గెబ్రూకు సంస్థ ఉద్యోగుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. ఇప్పటికే దాదాపు 1200 మంది ఉద్యోగులు ఆమెకు మద్దతుగా బహిరంగ లేఖ రాశారు. గెబ్రూ తొలగింపు అనూహ్య నిర్ణయమని పేర్కొన్నారు.  సంస్థ జాతివివక్ష, రక్షణాత్మక ధోరణితో వ్యవహరిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

మరిన్ని వార్తలు