పాక్‌ అభిమాని గూబ గుయ్‌మ‌నేలా..గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ రిప్లయ్‌ అదిరింది

24 Oct, 2022 20:16 IST|Sakshi

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ ‘మొదటి 3 ఓవర్లు’ చూడమని సలహా ఇచ్చిన పాక్‌ అభిమానికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అద్భుతంగా స్పందించారు. 

టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ అద్భుత విజయం సాధించింది. మెల్‌బోర్న్‌లో జరిగిన భారత్‌- పాక్‌ మ్యాచ్‌లో  కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. కళ్లముందే టీమ్‌ఇండియా టాప్‌ ఆర్డర్‌ పేకమేడలా కూలుతున్నా..ప్రశాంతంగా ఉన్నాడు. ఓడిపోతామనుకున్న మ్యాచ్‌ను చివరి వరకూ క్రీజ్‌లో నిలబడి గెలిపించాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో 53 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డును విరాట్ అందుకున్నాడు. 

నరాలు తెగే ఉత్కంఠలో దాయాది దేశంపై గెలిచిన భారత్‌పై క్రికెట్‌ లవర్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ దురభిమానులు మాత్రం జీర‍్ణించుకోలేకపోతున్నారు. పాక్‌ ఓటమిని తట్టుకోలేక టీవీలు పగలగొడుతున్నారు.మరికొందరు పాక్‌ బౌలింగ్‌ వేసిన మొదటి 3 ఓవర్లు చూడమని ట్వీట్‌లు చేస్తున్నారు. అయితే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కోహ్లీ ఆటతీరును ప్రశంసిస్తూ పిచాయ్ ఇలా ట్విట్‌ చేశారు. ‘దీపావళి శుభాకాంక్షలు! ఈ ఆనంద క్షణాల్నిస్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపండి. నేను ఈరోజు చివరి మూడు ఓవర్‌లను మళ్లీ చూసి సంబరాలు చేసుకున్నాను. వాట్‌ ఏ గేమ్‌.. వాట్‌ ఏ పర్‌ఫార్మెన్స్‌  అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.  


ఆ ట్వీట్‌పై ఓ పాక్‌ అభిమాని స్పందించాడు. ‘మీరు మొదటి మూడు ఓవర్లు చూడాలి’ అని వెటకారంగా అన్నాడు. దానికి పాక్‌ అభిమానికి గూబ గుయ్‌మ‌నేలా సుందర్‌ పిచాయ్‌ రిప్లయి ఇచ్చారు. ‘‘ఓ అది కూడా చూశాను. భువీ - అర్ష్‌దీప్ బౌలింగ్‌ అద్భుతంగా చేశారని ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ప్రస్తుతం సుందర్‌ పిచాయి పాక్‌ అభిమానికి ఇచ్చిన ఎపిక్‌ రిప్లయి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

చదవండి👉 సీఈఓ సుందర్‌ పిచాయ్‌కు గూగుల్‌ భారీ షాక్‌!

ఉద్యోగులకు ఫ్రీడమ్‌ ఇద్దాం.. సుందర్‌ పిచాయ్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు