Sundar Pichai: ఉండేది ఎక్కువ మంది.. పనిచేసేది కొద్ది మందేనా, ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్‌!

4 Aug, 2022 19:26 IST|Sakshi

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఉద్యోగుల పనితీరు విషయంలో అసంతృప్తిగా ఉన్నారా? పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నా..వారిలో కొంత మంది మాత్రమే పనిచేస్తున్నారని హెచ్చరించారా?

టెక్‌ దిగ్గజం గూగుల్‌ జులై 26న క్యూ2 వార్షిక ఫలితాల్ని వెల్లడించింది. ఆ ఫలితాల్లో గూగుల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆదాయాలు, రాబడుల పరంగా 'అంచనాల కంటే బలహీనంగా ఉంది' గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికంలో గూగుల్‌ 13 శాతం తక్కువ వృద్ధిని నమోదు చేసింది.ఈ ఫలితాలపై పిచాయ్‌ ఇంటర్నల్‌ మీటింగ్‌ నిర్వహించారు.  

మీ పర్‌ఫార్మెన్స్‌ బాగలేదయ్యా
గూగుల్‌ ఎక్జిక్యూటివ్‌లతో నిర్వహించిన మీటింగ్‌లో ఉద్యోగులు ప్రొడక్ట్‌లను మెరుగు పరుస్తూ కస్టమర్లకు సహాయ పడడం,ఉద్యోగులు వర్క్‌ ప్రొడక్టివిటీ పెంచేలా దృష్టి సారించాలని సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఉద్యోగుల సంఖ్యను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన..వారిలో ప్రొడక్టివిటీ తగ్గిందనే అసంతృప్తిలో ఉన్నారు. సంస్థలో (గూగుల్‌లో) ఎక్కువ మంది ఉద్యోగులున్నారు. కానీ వాళ్లు సమర్ధవంతంగా పనిచేయడం లేదని, పనిపై దృష్టి కేంద్రీకరించడం లేదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 

సుందర్‌ పిచాయ్‌ హింట్‌ ఇచ్చారా  
ఇటీవల మరో నివేదిక ప్రకారం.. గూగుల్‌ ఖర్చును తగ్గించేందుకు ఉద్యోగుల అవసరంపై సమీక్షలు జరిపి..రాబోయే 3నెలల్లో స్కిల్స్‌ ఉన్న ఉద్యోగుల్ని నియమించడంతో పాటు, సామర్థ్యం, ఉత్పాదకత, నైపుణ్యం లేని తొలగించాలని భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ..కొత్తగా ఉద్యోగుల్ని నియమించుకోవడం లేదని గూగుల్‌ ఇచ్చిన స్టేట్మెంట్‌ను ఉదహరిస్తున్నాయి. కాగా,ఆర్ధిక మాంద్యం భయంతో అనేక పెద్ద టెక్ కంపెనీలు వందలాది మంది ఉద్యోగులను తొలగించాయి. నియామకాన్ని నిలిపి వేశాయి. ఇప్పుడు అదే బాటులో గూగుల్‌ పయనిస్తుందంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: మీ పర్‌ఫార్మెన్స్‌ బాగలేదయ్యా! కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు!

మరిన్ని వార్తలు