గూగుల్ క్రోమ్ కొత్త లోగో

20 Nov, 2020 16:50 IST|Sakshi

గూగుల్ తన అప్లికేషన్‌ లొగోలలో గత రెండు నెలల నుండి మార్పులు చేస్తుంది. తాజాగా గూగుల్ క్రోమ్‌ యొక్క లోగో కూడా మార్చనున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల క్రితం నుండి ఆపిల్ యొక్క కొత్త M1- టోటింగ్ మాక్స్‌లో గూగుల్ క్రోమ్ యొక్క కొత్త లోగో అందుబాటులో ఉంది. తదుపరి తీసుకు రాబోయే గూగుల్ క్రోమ్ యొక్క కొత్త లోగో బాగుంది అని కొందరి అభిప్రాయం. కొత్త క్రోమ్ చిహ్నాన్ని రూపొందించడానికి గూగుల్ పాత క్రోమ్ చుట్టూ ఒక పెట్టెను బ్యాక్ గ్రౌండ్ లో తీసుకొచ్చింది. గూగుల్‌లో డిజైనర్ మరియు డెవలపర్ అయిన ఎల్విన్ హు దీన్ని షేర్ చేసారు.(చదవండి: 5,000లలో బెస్ట్ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్)

పైన చెప్పుకున్న విదంగా మొదటి డిజైన్(ఎ) లోగో ఉంటుంది. B మరియు C డిజైన్ లలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. గూగుల్ తన అప్లికేషన్‌ లొగోలలో గత రెండు నెలల నుండి మార్పులు చేస్తుంది. అయితే ఈ కొత్త లుక్‌పై యూజర్ల‌ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది కొత్త లుక్‌ బావుదంటే మరికొందరు పాత లొగోలు బావున్నాయని అంటున్నారు. ముఖ్యంగా జీమెయిల్ లొగో విషయంలో పెద్ద చర్చే జరిగింది. 

మరిన్ని వార్తలు