గూగుల్ క్రోమ్ యూజర్లకు షాక్.. ఆ కంప్యూటర్లకు సేవల నిలిపివేత

9 Jan, 2023 22:03 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ యూజర్లకు షాకిచ్చింది. జనవరి 10 నుంచి విండోస్ 7, 8, 8.1 విండోలతో పనిచేసే డెస్క్‌ ట్యాప్‌లలో గూగుల్ క్రోమ్ పనిచేయదు. గూగుల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ వెర్షన్లకు సపోర్ట్‌ చేయడాన్ని మైక్రోసాఫ్ట్ మూడేళ్ల క్రితమే నిలిపేసింది. ఇప్పుడు గూగుల్ వంతు వచ్చింది. క్రోమ్109 పైన నడుస్తున్న డెస్క్‌ టాప్‌లకు పైన పేర్కొన్న ఓఎస్ వెర్షన్‌లవే చిట్ట చివరివి అవుతాయి.

మైక్రోసాఫ్ట్ బాటలో..
కొత్త ఓఎస్ వెర్షన్ల రాకతో, పాతవి, సమర్థవంతంగా లేని ఆపరేటింగ్ సిస్టమ్స్కు సపోర్టు చేయటం తగ్గిపోతోంది. ఇప్పుడు విండోస్ 7, 8, 8.1 కొత్తగా చేరుతున్నాయి.మైక్రోసాఫ్ట్ ఈ ఓఎస్ వెర్షన్లకు సపోర్ట్‌ చేయడం నుంచి వైదొలగడంతో, వాటిల్లో ఉండే క్రోమ్‌కు సెక్యూరిటీ సపోర్ట్‌ నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించుకుంది.

వచ్చే నెలలో క్రోమ్ 110 వెర్షన్
క్రోమ్ కొత్త వెర్షన్ ‘క్రోమ్ 110’ ని గూగుల్ ప్రకటించింది. ఫిబ్రవరి 7, 2023లో కొత్తగా మార్కెట్లోకి విడుదల చేయనుంది. విండోస్ 10 దాని తర్వాత వెర్షన్ల వారికి ఉపయోగపడే మొట్టమొదటి క్రోమ్ వెర్షన్ ఇదే అవుతుంది. పాత వెర్షన్ విండోస్ .. అంటే విండోస్ 7, 8, 8.1 ఉన్న డెస్క్ టాప్ లకు ఈ బ్రౌజర్ ను పొందడం వీలుకాదు.

క్రోమ్ 109 పనిచేస్తుంది.. కానీ
విండోస్ 7, 8, 8.1 తో పనిచేసే డెస్క్‌ టాప్‌లకు క్రోమ్ 109 పనిచేస్తుంది. గూగుల్ నుంచి వాళ్లకి అప్ డేట్స్ రావు. దీనివల్ల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉండవు. సెక్యూరిటీ రిస్క్, ఇతర సమస్యలు ఎక్కువ అవుతాయి. వీటిని ఎదుర్కోవటానికి ఉన్న ఏకైక మార్గం.. సపోర్టెడ్‌ విండో వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చుకోవటమే.

వీలయినంత త్వరగా అప్ డేట్ చేసుకోవాలి

కొత్తగా వచ్చే ‘క్రోమ్ 110’ బ్రౌజర్ వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చుకోవాలనుకుంటే, మీ డెస్క్‌ టాప్‌ను విండోస్ 10కి వీలయినంత వేగంగా అందుబాటులోకి తెచ్చుకోవటమే.

 ‘విండోస్ అప్ డేట్’ సెట్టింగ్‌ను ఓపెన్ చేయండి. ‘అప్ డేట్ అండ్ సెక్యూరిటీ’ పై ట్యాప్‌ చేయాలి.  

అక్కడ ‘విండోస్ అప్ డేట్’ ఆప్షన్ పై క్లిక్‌ చేసి ‘చెక్ ఫర్ అప్ డేట్స్’ పై ట్యాప్‌ చేయండి
 
మీ కంప్యూటర్‌ సపోర్ట్‌ చేస్తే ఆప్షన్ టు డౌన్ లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ‘డౌన్ లోడ్ అండ్ ఇన్ స్టాల్’ అనేదాని మీద ట్యాప్‌ చేయండి. లేటెస్ట్‌ వెర్షన్‌ అప్‌డేట్‌ అవుతుంది. 

మరిన్ని వార్తలు