Google Storage: జీమెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌, ఫోటోస్‌ డాటా దాచుకునేందుకు తక్కువలో కొత్త ప్యాకేజీ

13 Sep, 2021 07:37 IST|Sakshi

వర్క్‌ఫ్రమ్‌ హోం ఇతరత్ర కారణాలతో డేటా స్టోరేజ్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది గూగుల్‌.  కొత్తగా క్లౌడ్‌ స్టోరేజ్‌ ప్లాన్‌లను ప్రకటించింది.  అందులో 5టీబీ స్టోరేజ్‌ ప్లాన్‌ను మంత్లీ, ఇయర్లీ ప్యాకేజీవారీగా తక్కువ ధరకే అందిస్తుండడం విశేషం.


గూగుల్‌ సర్వీస్‌లోని జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌లోని ఇమేజెస్‌, వీడియోస్‌, గూగుల్‌ డ్రైవ్‌లో ఏదైనా డాటా స్టోర్‌ చేసుకోవడానికి ఒక లిమిట్‌(15 జీబీ) అంటూ ఉంది కదా. ఒకవేళ ఆ పరిధి దాటి ఉపయోగించుకోవాల్సి వస్తే.. స్టోరేజ్‌ను మంత్లీ/ఇయర్లీ ప్యాకేజీల వారీగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.  తాజాగా గూగుల్‌ వన్‌ యాప్‌ ప్రకటన ప్రకారం.. తక్కువ ధరలో 5 టీబీ స్టోరేజ్‌ కోసం నెలకు 1,649రూ. అందిస్తుండగా,  ఏడాది ప్లాన్‌కు 15, 900రూ. చెల్లించాల్సి ఉంటుంది.  

మిగతావి ఇలా.. 
ఇక 5టీబీ స్టోరేజ్‌ను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి పంచుకునే వీలు కూడా ఉంది. అంతేకాదు భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో గూగుల్‌ వీపీఎన్‌ సర్వీస్‌ సైతం ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించనుంది గూగుల్‌. గత ప్లాన్‌ల ప్రకారంగానే స్టోరేజ్‌ ప్యాకేజీలను గూగుల్‌ యూజర్లకు అందిస్తోంది. 100 జీబీ స్టోరేజ్‌ కోసం నెలకు రూ.130 చెల్లిస్తే.. , ఏడాదికి 1,300రూ. చెల్లించాలి. 200జీబీ ప్లాన్‌ కోసం నెలకు 210రూ., ఏడాదికి 2,100రూ. చెల్లించాలి. 2 టీబీ స్టోరేజ్‌ కోసం నెలకు 650రూ., ఏడాదికి రూ.6,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూడు ప్లాన్స్‌ కూడా గూగుల్‌ వన్‌ వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా సబ్‌స్క్రయిబ్‌ చేసుకోవచ్చు.

క్లిక్‌: గూగుల్‌ ‘చిప్‌’.. అంతా బిల్డపేనా?
 

రేటు ఎక్కువే.. 
అయితే 2 టీబీ స్టోరేజ్‌ కంటే మించి ప్లాన్స్‌ మాత్రం యాప్‌ ద్వారానే సబ్ స్క్రయిబ్ చేసుకోవాల్సి ఉంటుంది.  యాప్‌లో 10 టీబీ ప్లాన్‌ నెలకు రూ.3,249రూ. కాగా, 20 టీబీ స్టోరేజ్‌కు నెలకు 6,500రూ. చెల్లించాల్సి ఉంటుంది. ఇక టాప్‌ టైర్‌ ప్లాన్‌గా చెప్పుకునే 30టీబీ స్టోరేజ్‌ కోసం నెలకు 9,700రూ. చెల్లించాల్సి ఉంటుంది.  ఇక 100 జీబీ, 200జీబీ, 2టీబీ ప్లాన్స్‌ గూగుల్‌ వన్‌ వెబ్‌సైట్‌ కంటే యాప్‌లో అత్యధిక రేటుకు అందజేయడం కొసమెరుపు.  

గూగుల్‌ ఫోటోస్‌ నుంచి అపరిమిత డేటా స్టోరేజ్‌ సౌకర్యాన్ని ఈ ఏడాది మొదట్లో గూగుల్‌ తొలగించిన విషయం తెలిసిందే. అంతకు ముందు నుంచే గూగుల్‌ డ్రైవ్‌ విషయంలో ఇది అమలు అవుతోంది. ఇక  15 జీబీ డాటా స్టోరేజ్‌ దాటితే.. కచ్చితంగా  స్టోరేజ్‌ కొనుగోలు చేయాలని, లేకుంటే కొత్తగా డాటా స్టోర్‌కాదని, పైగా ఆల్రెడీ స్టోరేజ్‌పై ప్రభావం పడి డిలీట్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని స్పష్టం చేసింది కూడా.

చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్‌ ఇదే..!

>
మరిన్ని వార్తలు