కొత్త డిజిటల్ నిబంధనలపై స్పందించిన సుందర్‌ పిచాయ్‌

27 May, 2021 20:33 IST|Sakshi

న్యూఢిల్లీ: మే 25 నుంచి ప్రభుత్వ కొత్త డిజీటల్ నిబంధనలు అమల్లోకి రావడంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలపై టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. ‘‘మేం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి దేశంలో అక్కడి స్థానిక చట్టాలను, ప్రభుత్వ అభ్యర్థనలను తమ సంస్థ గౌరవిస్తుందని. ఇది మా సంస్థ పారదర్శకత నివేదికలలో కూడా హైలైట్ చేయబడింది. స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌ భారత్‌లో సుదీర్ఘంగా ఉన్న సంప్రదాయం. ఒక కంపెనీగా ఆ స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌ విలువలు, వాటి ప్రయోజనాల గురించి మాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఏ నియంత్రణ సంస్థలతోనైనా మేం కలిసి పనిచేయడానికి సిద్దం’’ అని సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు.

అన్నీ దేశాలలోని శాసన, న్యాయపరమైన ప్రక్రియల విధానాలపై మాకు గౌరవం ఉంది. ప్రభుత్వాలు కూడా రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లను పరిశీలించి, అవలంబించాలని మేము ఆశిస్తున్నాము అని అంది. కాపీరైట్ ఆదేశాలకు, సమాచార నియంత్రణకు సంబందించి యూరప్ లేదా భారతదేశం తాము ఒకవిధంగా చూస్తాము అని పిచాయ్ అన్నారు. భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక ప్రధాన సోషల్ మీడియా సంస్థలలో ఒకటైన ట్విట్టర్ కొత్త మార్గదర్శకాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో సుందర్ పిచాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఫేస్ బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ ఈ కొత్త నిబందనలను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొత్త ఐటీ నిబంధనలు భావ ప్రకటనా స్వేచ్ఛ, గోప్యతా హక్కులను ఉల్లఘించినట్లు తన పిటిషన్ లో పేర్కొంది. ఫేస్‌బుక్ స్వయంగా ఈ హక్కులను పాటిస్తుందని తెలిపింది. అయితే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని పరిష్కరించుకోవాలనుకుంటుంది అని పేర్కొంది. ఇదిలా ఉంటే, ట్విటర్ గురువారం మార్గదర్శకాలను పాటించటానికి ప్రయత్నిస్తుందని తెలిపింది. వాక్ స్వాతంత్య్రం, గోప్యతను పరిరక్షించడంలో నిబద్ధతను వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ప్రతినిధి వెల్లడించారు. ఈ నిబంధనలలోని కొన్ని నిబంధనలను సవరించాలని కోరడానికి ట్విటర్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని యోచిస్తోంది.

చదవండి: 

గుడ్ న్యూస్: అలా అయితే టోల్ గేట్ చార్జీలు కట్టక్కర్లేదు!

మరిన్ని వార్తలు