Google: ఆ స్మార్ట్‌ఫోన్లు ఇకపై కనిపించవు...!

21 Aug, 2021 21:26 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన ప్రత్యర్థి ఆపిల్‌కు పోటీగా పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పిక్సెల్‌ 5ఏ 5జీ స్మార్ట్‌ఫోన్లను గూగుల్‌ మార్కెట్లలోకి రిలీజ్‌ చేసింది. కాగా గూగుల్‌ ఇకపై మార్కెట్లలోకి పిక్సెల్‌ 4ఏ 5జీ, పిక్సెల్‌ 5 స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి నిలిపివేయనున్నట్లు సమాచారం. గూగుల్‌ పిక్సెల్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తోనందుకు గాను పిక్సెల్‌ 4ఏ 5జీ, పిక్సెల్‌5 స్మార్ట్‌ఫోన్లను నిలిపివేయనుందని తెలుస్తోంది.

చదవండి: Gautam Adani : గౌతమ్‌ అదానీకి భారీ షాక్‌..!

పిక్సెల్‌ 4ఏ 5జీ, పిక్సెల్‌​ 5 స్మార్ట్‌ఫోన్స్‌ గూగుల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో సోల్డ్‌ ఔట్‌ అనే మెసేజ్‌ను యూజర్లకు చూపిస్తోందని ప్రముఖ టెక్‌ ఎక్స్‌పర్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ ది వెర్జ్‌ పేర్కొంది. పిక్సెల్‌ 4, పిక్సెల్‌ 4ఎక్స్‌ఎల్‌ను ప్రవేశపెట్టిన సంవత్సరంలోపే ఈ స్మార్ట్‌ఫోన్లను గూగుల్‌ నిలిపివేయనుంది.   ప్రస్తుతం రిలీజ్‌ చేసిన గూగుల్‌ పిక్సెల్‌ 5ఏ 5జీ ను కేవలం అమెరికా, జపాన్‌ మార్కెట్లలోకే రిలీజ్‌ చేసింది. భారత మార్కెట్లలోకి ఎప్పుడూ వస్తూందనే విషయం గూగుల్‌ ఇప్పటివరకు వెల్లడించలేదు.గూగుల్ తన రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన పిక్సెల్ 6,  పిక్సెల్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్లకు  ఛార్జర్ లేకుండా మార్కెట్లలోకి రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం.

(చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్‌ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్‌...!)

మరిన్ని వార్తలు