YouTube Shorts: గూగుల్‌ అదిరిపోయే శుభవార్త, ఇక యూట్యూబ్‌లో చెలరేగిపోవచ్చు

18 Nov, 2021 18:06 IST|Sakshi

యూట్యూబ్‌ క్రియేటర్లకు గూగుల్‌ ఇండియా అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారత్‌లో యూట్యూబ్‌ షార్ట్స్‌ టైమ్‌ డ్యూరేషన్‌ పై కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో యూట్యూబ్‌ ఛానల్‌ క్రియేటర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లైందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.   

యూట్యూబ్‌ షార్ట్స్‌లో టైమ్‌ డ్యూరేషన్‌ తక్కువే 
2020 సెప్టెంబర్‌లో గూగుల్‌ సంస్థ యూట్యూబ్‌ షార్ట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ షార్ట్స్‌ లో ఇన్సిడెంట్‌ ఏదైనా కట్టే కొట్టే తెచ్చే అన్న చందంగా  60 సెకన్ల వ్యవధి వీడియోను చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ షార్ట్స్‌ వీడియోస్‌లో 15 సెకన్లు, అంతకంటే తక్కువ టైమ్‌ డ్యూరేషన్‌ ఉన్న వీడియోల్ని చేసేందుకు అనుమతిస్తున్నట్లు ఈరోజు జరిగిన ఓ ఈవెంట్‌లో గూగుల్‌ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

యూట్యూబ్‌ షార్ట్స్‌తో లాభాలు 
యూట్యూబ్‌ షార్ట్స్‌ వల్ల నిర్వహకులకు అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించాలనుకునేవారికి ఈ ప్లాట్‌ ఫాం సువర్ణ అవకాశమనే చెప్పుకోవాలి. నిమిషాల వ్యవధి వీడియోల కంటే సెకన్ల వ్యవధి వీడియో చేయడం చాలా ఈజీ. అదే సమయంలో వ్యూస్‌, ఛానల్‌ బ్రాండింగ్‌ వేగం పెరిగిపోతుంది. ఈ జనరేషన్‌ క్రియేటర్స్, ఆర్టిస్ట్‌ల క్రియేటివిటీని బిజినెస్‌గా మలచడంలో సహాయపడుతుంది. 

క్రియేటర్లకు వంద మిలియన్‌ డాలర్లు 
యూట్యూబ్‌ షార్ట్స్‌ ద్వారా గుర్తింపు పొందిన కంటెంట్‌ క్రియేటర్లకు ప్రతినెలా డబ్బులు సంపాదించుకోవచ్చు. టిక్‌.. టాక్‌ గత సంవత్సరం ‘క్రియేటర్స్‌ ఫండ్‌’ పేరుతో రెండు వందల మిలియన్‌ డాలర్లను కేటాయించింది. అదే బాటలో యూట్యూబ్‌  కూడా కంటెంట్‌ క్రియేటర్ల కోసం వంద మిలియన్‌ డాలర్లు (2021–2022) కేటాయించింది. ఇప్పుడు మనదేశంలో టిక్‌... టాక్‌ లేకపోవడంతో చాలామంది క్రియేటర్లు యూట్యూబ్‌ షార్ట్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వారిని మరింత ప్రోత్సహించేందుకు గూగుల్‌ భారీ ఎత్తున ఫండ్‌ను కేటాయించింది.

చదవండి: హాయ్‌ గైస్‌...నేను మీ షెర్రీని..!! 

మరిన్ని వార్తలు