Google: హద్దుమీరిన గూగుల్‌..! భారీ మూల్యం తప్పదా..!

15 Aug, 2021 17:43 IST|Sakshi

వాషింగ్టన్‌:  అమెరికాకు చెందిన ప్రముఖ వైర్‌లెస్‌ స్పీకర్ల తయారీదారు సోనోస్‌ ఇంక్‌ స్మార్ట్‌ మ్యూజిక్‌ సంస్థ గూగుల్‌ కంపెనీపై యూఎస్‌ ఫెడరల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గూగుల్‌ హోమ్‌ స్మార్ట్‌ స్పీకర్స్‌ ఉత్పత్తుల విషయంలో ఐదు పేటెంట్లను ఉల్లంఘించిందనే కారణంతో ఫెడరల్‌ కోర్టులో సోనోస్‌ పిటిషన్‌ను వేసింది. సోనోస్‌ తన పిటిషన్‌లో గూగుల్‌ పేటెంట్స్‌ హక్కులను ఉల్లంఘించినందుకుగాను అమెరికాలో గూగుల్‌ స్మార్ట్‌ స్పీకర్లు, స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్‌ అమ్మకాలను నిషేధించాలని, అంతేకాకుండా కంపెనీలకు నష్టపరిహరాన్ని కూడా అందించాలని కంపెనీ ఫెడరల్‌ కోర్టులో పేర్కొంది.

తన కంపెనీ పేటెంట్లను గూగుల్‌ 2015 నుంచే ఉల్లంఘించడం మొదలుపెట్టిందని సోనోస్‌ వెల్లడించింది. తాజాగా పిటిషన్‌పై యూఎస్‌ ఫెడరల్‌ కోర్టులో విచారణ జరిగింది. విచారణలో గూగుల్‌ పేటెంట్ల హక్కులను ఉల్లఘించినట్లు కోర్టు నిర్థారించింది. 1930 ఫెడరల్‌ టారిఫ్‌ చట్టాన్ని గూగుల్‌ ఉల్లఘించిందని కోర్టు పేర్కొంది. గూగుల్‌పై దిగుమతి ఆంక్షలను కోర్టు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గూగుల్‌  పేటెంట్లను ఉల్లంఘణలకు పాల్పడిందని తెలిసిన క్షణంలో సోనోస్‌ షేర్లు 11.4 శాతం మేర ఎగబాకాయి.  

మరిన్ని వార్తలు