వావ్‌! యూజర్లకు గూగుల్‌ శుభవార్త!

27 Jun, 2022 10:51 IST|Sakshi

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ తన యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలో ఇంటర్నెట్‌తో అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌లో జీ మెయిల్‌ను ఉపయోగించుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు ప్రకటించింది. 

జీమెయిల్‌. పరిచయం అక్కర్లేని పేరు. గూగుల్‌కు చెందిన ఈమెయిల్ సర్వీస్‌ను 18శాతం ఈమెయిల్‌ క్లయింట్‌ మార్కెట్‌ షేర్‌తో గతేడాది 1.8 బిలియన్ల మందికిపై గా వినియోగించారు. 75శాతం మందికి పైగా వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లలో జీమెయిల్‌ను ఉపయోగించుకుంటున్నారు.    

ఈ తరుణంలో రూరల్‌ ఏరియాలు, నెట్‌ స్లోగా ఉన్న ప్రాంతాల్లో మార్కెట్‌ షేర్‌ను పెంచుకునేందుకు గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్‌లైన్‌లో జీమెయిల్‌ సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

జీమెయిల్‌ను ఆఫ్‌ లైన్‌లో వినియోగించుకోవాలంటే 

ముందుగా జీమెయిల్‌ సెట్టింగ్‌ ఆప్షన్‌లో ట్యాప్‌ చేయాలి. 

కాగ్‌ వీల్‌ బటన్‌ పై క్లిక్‌ చేసి అందులో సీ ఆల్‌ సెట్టింగ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. 

మీరు ఆన్‌లైన్‌లో ఉంటే అక్కడ ఆఫ్‌లైన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. 

అనంతరం చెక్‌ బాక్స్‌ ఎనేబుల్‌ ఆఫ్‌లైన్‌ మెయిల్‌ 
క్లిక్ చేయండి.

మీరు చెక్ బాక్స్ ను క్లిక్ చేసిన మరుక్షణం, జీమెయిల్‌  కొత్త సెట్టింగ్ లను చూపుతుంది.

ఆ సెట్టింగ్స్‌ ఎనేబుల్‌ చేస్తే జీమెయిల్‌ ఆఫ్‌లైన్‌ సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. 

మరిన్ని వార్తలు